Gyanvapi Masjid Case: జ్ఞాన్వాపి మసీదు వివాదంపై నేడే తీర్పు

ఆగస్టు 24న ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును సెప్టెంబర్ 12కు వాయిదా వేశారు. అయితే ఈ విషయమై విచారనే అవసరం లేదని, కొంత మంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని, మసీదుకు సంబంధించిన స్థలం సహా మిగిలిన ఆస్తులు పూర్తిగా వక్ఫ్ బోర్డుకు చెందుతాయని మసీదు కమిటీ అఫిడవిట్ దాఖలు చేసింది

Gyanvapi Masjid Case: జ్ఞాన్వాపి మసీదు వివాదంపై నేడే తీర్పు

All eyes on Gyanvapi Masjid case as Varanasi court set to deliver order today

Updated On : September 12, 2022 / 8:07 AM IST

Gyanvapi Masjid Case: వివాదాల్లో మునిగి తేలుతోన్న జ్ఞాన్వాపి మసీదు కేసుపై వారణాసి కోర్టు ఈరోజు కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ మసీదులో హిందువులకు పూజలు చేసుకునే అవకాశం కల్పించాలంటూ ఒక హిందూ విశ్వాసి వేసిన పిటిషన్‭ను విచారణ చేపట్టిన కోర్టు.. తీర్పును ఈరోజుకు వాయిదా వేసింది. మసీదులో పూజలకు అనుమతి ఇవ్వడానికి సంబంధించి కొనసాగుతున్న విచారణ సమ్మతమేనా, ఇందుకు న్యాయపరమైన కారణాలు ఏమున్నాయనే విషయమై వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తారని అంటున్నారు.

ఈ విషయమై ఆగస్టు 24న ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును సెప్టెంబర్ 12కు వాయిదా వేశారు. అయితే ఈ విషయమై విచారనే అవసరం లేదని, కొంత మంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని, మసీదుకు సంబంధించిన స్థలం సహా మిగిలిన ఆస్తులు పూర్తిగా వక్ఫ్ బోర్డుకు చెందుతాయని మసీదు కమిటీ అఫిడవిట్ దాఖలు చేసింది. అంతే కాకుండా ఈ విషయమై ఎలాంటి వాదనలు వినాలన్నా వక్ఫ్ బోర్డుకు మాత్రమే అధికారం ఉందని, దానికి మాత్రమే ఆ హక్కును కల్పించాలని అఫిడవిట్‭లో పేర్కొన్నారు.

జ్ఞాన్వాపి మసీదులో శివలింగం ఉందని, ఆ శివలింగానికి పూజలు చేయడానికి అనుమతి కల్పించాలంటూ హిందూ విశ్వాసులు కొందరు కోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా ఈ అంశం దుమారం లేపింది. హిందూ-ముస్లిం వాదప్రతివాదనల నడుమ మసీదుపై సర్వే చేపట్టడానికి కోర్టు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‭ను పరిశీలించిన అనంతరం వారణాసి కోర్టు తీర్పు వెలువరించనుంది.

Sravanthi Palvai : ప్రచారం చేయండి ప్లీజ్.. కోమటిరెడ్డిని కలిసిన మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి