మరో తమిళ మంత్రికి కరోనా పాజిటివ్

  • Published By: venkaiahnaidu ,Published On : July 10, 2020 / 05:34 PM IST
మరో తమిళ మంత్రికి కరోనా పాజిటివ్

Updated On : July 10, 2020 / 5:54 PM IST

తమిళనాడులో మరో మంత్రికి కరోనా సోకింది. ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూర్ కె. రాజుకు శుక్రవారం కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తమిళనాడులో ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులు కరోనా బారినపడ్డారు.

జూన్ 18న ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పి. అన్బాలగన్‌కు కరోనా సోకింది. జూలై 8న విద్యుత్ శాఖ మంత్రి పి.తంగమణికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందారు. తాజాగా ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూర్ కె. రాజుకు కూడా కరోనా సోకినట్లు తేలింది.

నాలుగు రోజుల కిందట మంత్రి సెల్లూర్ రాజు భార్యకు కరోనా సోకడంతో గురువారం ఆయనకు కూడా పరీక్షలు జరిపారు. టెస్టులో మంత్రి సెల్లూర్ రాజుకు కూడా కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మంత్రి రాజు అడ్మిట్ అయ్యారు. తమిళనాడులో ఇప్పటి వరకు 1.22 లక్షల మందికి వైరస్ సోకగా, 1700 మరణించారు.

తమిళనాడులో పలువురు ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రతిపక్ష డీఎంకే పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు కూడా కరోనా బారినపడ్డారు. కాగా,గతనెలలో కరోనాతో ఓ డీఎంకే ఎమ్మెల్యే మృతిచెందిన విషయం తెలిసిందే