Amit Shah on Owaisi: ఓవైసీ సాబ్ కూడా నవ్వుతున్నారు.. కొత్త బిల్లులు ప్రవేశపెడుతూ అమిత్ షా ఎందుకిలా అన్నారు?

బిల్లు ఆమోదం కోసం పార్లమెంటులో అమిత్ షా బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు.. ఒవైసీ ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. దీనికి షా స్పందిస్తూ.. ఒవైసీ సాబ్ కూడా నవ్వుతున్నారు.. నేను కూడా కొంచెం సైకాలజీ చదివాను

Amit Shah on Owaisi: ఓవైసీ సాబ్ కూడా నవ్వుతున్నారు.. కొత్త బిల్లులు ప్రవేశపెడుతూ అమిత్ షా ఎందుకిలా అన్నారు?

Updated On : December 20, 2023 / 7:04 PM IST

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో క్రిమినల్ లాకు సంబంధించి మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులు వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదం పొందాయి. ఇప్పుడు ఈ మూడు బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లును సమర్పిస్తున్న సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. అయితే మధ్యలో హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై ఆయన మండిపడ్డారు.

బిల్లు ఆమోదం కోసం పార్లమెంటులో అమిత్ షా బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు.. ఒవైసీ ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. దీనికి షా స్పందిస్తూ.. ‘‘ఒవైసీ సాబ్ కూడా నవ్వుతున్నారు.. నేను కూడా కొంచెం సైకాలజీ చదివాను.. మూడు చట్టాల్ని మార్చేశానని ఆయన మనసులో ఉంది. రాజద్రోహానికి బదులు దేశద్రోహ బిల్లును తీసుకొచ్చాం’’ అని అన్నారు. కేంద్ర హోంమంత్రి ఇంకా మాట్లాడుతూ, “ఇప్పుడు ఈ దేశం స్వాతంత్ర్యం పొందింది. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రభుత్వంపై ఎవరైనా వ్యాఖ్యానించవచ్చు, ఎవరికైనా అలా చేసే హక్కు ఉంది’’ అని అన్నారు.

ఒవైసీ సాహెబ్ చాలా వ్యంగ్యంగా నవ్వుతున్నాడని, అందుకే ఆ వ్యత్యాసాన్ని వివరిస్తున్నానని అమిత్ షా అన్నారు. కానీ ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేరని, ఈ దేశ ప్రయోజనాలను ఎవరూ దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. ఈ దేశ సరిహద్దులతో, దేశ వనరులతో, దేశ జెండాతో ఆడుకోవద్దని, హద్దు మీరితే జైలుకు వెళ్లక తప్పదని అమిత్ షా హెచ్చరించారు.