అమిత్ షా హోంమంత్రి అవడం ఖాయం

నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తే బీజేపీ చీఫ్ అమిత్ షా హోంమంత్రి అవుతారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.ఓటర్లు తమ ఓటు వేసే ముందు ఆలోచించుకుని ఓటు వేయాలని కేజ్రీవాల్ కోరారు. అమిత్ షా హోంమంత్రి అయితే దేశానికి ఏమవుతుంది అని ఆయన ప్రశ్నించారు.దీని గురించి ఆలోచించి అందరూ ఓటు వేయాలని ఓటర్లకు ఆప్ అధినేత విజ్ణప్తి చేశారు.
మోడీ మరోసారి ప్రధాని అయితే అమిత్ షా హోంమంత్రి అవుతాడని గతంలో కూడా కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.ప్రధాని మోడీపైన కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు.మోడీని ఓ నకిలీ జాతీయుడిగా అభివర్ణించారు.భారతదేశ ప్రధానిగా మోడీ కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.గడిచిన 70 ఏళ్లల్లో భారత ప్రధాని కోసం పాక్ ప్రధాని బ్యాటింగ్ ఆడిన ఉదాహరణలు ఎప్పుడూ లేవని కేజ్రీవాల్ విమర్శించారు.ఆప్ ప్రభుత్వ పనితీరుపై మోడీ చేసిన విమర్శలపై గురువారం స్పందించిన కేజ్రీవాల్..ఎలక్ట్రిసిటీ,వాటర్,హెల్త్,ఎడ్యుకేషన్ సంబంధిత ఇష్యూలను తమ పార్టీ మాట్లాడినట్లు తెలిపారు.
ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలకు ఆదివారం(మే-12,2019)న పోలింగ్ జరుగనుంది.మే-23,2019న ఫలితాలు వెలువడనున్నాయి.