Anand Mahindra : ఆరుగురు ప్రయాణించే బైక్‌.. ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన ఆనంద్‌ మహీంద్రా

పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్ర సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తరచూ పలు ఆసక్తికర విషయాలు, ఫొటోలు, వీడియోలుషేర్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మరో సృజనాత్మక విషయాన్ని ఆనంద్ మహీంద్రా నెటిజన్లకు తెలియజేశారు.

Anand Mahindra : ఆరుగురు ప్రయాణించే బైక్‌.. ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన ఆనంద్‌ మహీంద్రా

Anand Mahindra

Updated On : December 2, 2022 / 9:11 PM IST

Anand Mahindra : పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్ర సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తరచూ పలు ఆసక్తికర విషయాలు, ఫొటోలు, వీడియోలుషేర్ చేస్తుంటారు. స్ఫూర్తినిచ్చే వాటిని పరిచయం చేస్తూ కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారు.

అయితే ఇప్పుడు మరో సృజనాత్మక విషయాన్ని ఆనంద్ మహీంద్రా నెటిజన్లకు తెలియజేశారు. ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ వాహనం చూడటానికి పెద్ద పరిమాణంలో బైక్ లా కనిపిస్తోంది. వేర్వేరు సీట్లు కలిగి ఉన్న ఈ పొడవాటి వాహనంలో ఆరుగురు కూర్చోవడానికి వీలుంది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో షేర్ చేశారు.

15 pens..15 paintings Girl : 15పెన్నులతో ఒకేసారి 15 చిత్రాలు గీసిన బాలిక ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ఫిదా

గ్రామీణ ప్రాంతాల్లోని రవాణారంగ ఆవిష్కరణలు తనను ఎప్పుడూ ఆకట్టుకుంటాయని, అక్కడి అవసరాలే ఆవిష్కరణలకు మూలమని ట్వీట్ చేశారు. ఈ వాహనాన్ని తయరు చేసేందుకు రూ.12 వేల ఖర్చు చేసినట్లు రూపకర్త తెలిపారు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 150 కి.మీ ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.