ట్రక్ డ్రైవర్ ప్రతిభను తెలియజేస్తూ.. స్ఫూర్తిదాయకమైన వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

ఏ వయస్సులోనైనా మీ వృత్తితో సంబంధం లేకుండా మిమ్మల్ని మీరు కొత్త దారుల్లో అడుగులు వేసేందుకు ఎప్పుడూ ఆలస్యం కాదంటూ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

ట్రక్ డ్రైవర్ ప్రతిభను తెలియజేస్తూ.. స్ఫూర్తిదాయకమైన వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Rajesh Rawani

Updated On : April 8, 2024 / 1:28 PM IST

Anand Mahindra : మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో స్ఫూర్తిదాయకమైన వీడియోలను షేర్ చేస్తుంటారు. ప్రతిభను చూపిన వారికి అండగా నిలుస్తూ సహాయసహకారాలు అందిస్తుంటారు. ఇటీవల యూపీలో బస్తి జిల్లాకు నికిత అనే 13ఏళ్ల బాలిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి కోతుల దాడి నుంచి ఏడాది వయస్సున్న తన మేనకోడలును కాపాడుకుంది. ఆ చిన్నారి ప్రతిభను మెచ్చుకుంటూ.. ఆమె పెరిగి పెద్దదైన తరువాత తాను ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆనంద్ మహీంద్రా వార్తలో నిలిచాడు. తాజాగా, ఓ ట్రక్ డ్రైవర్ ప్రతిభను తెలియజేసే వీడియోను ఆనంద్ మహీంద్ర తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కొత్త మార్గాన్ని ఎంచుకొని పట్టుదల, తెలివితేటలతో ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుందని ఆనంద్ మహింద్రా తెలియజేశారు.

Also Read : Anand Mahindra : ఆపిల్ విజన్ ప్రో.. మనుషులకు దూరంగా.. వర్చువల్‌కు దగ్గరగా.. ఇదే మన భవిష్యత్తు అంటే.. అది పీడకలే : ఆనంద్‌ మహీంద్రా ఆందోళన

25ఏళ్లుగా ట్రంక్ డ్రైవర్ కొనసాగుతున్న రాజేష్ రావనీ తన ట్రక్ క్యాబిన్లో వంట చేస్తున్న వీడియోను ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. రాజేష్ అనే వ్యక్తి తన తెలివితేటల ద్వారా డిజిటల్ యుగంలో సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విజయవంతమైన యూట్యూబర్ గా మారాడు. ట్రక్ డ్రైవర్ గా కొనసాగుతూనే ట్రావెలింగ్ సమయంలో వంటలు చేస్తూ వాటిని తన యూట్యూబ్ లో పెడుతుంటాడు.. ఆయన యూట్యూబ్ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. కొత్త కొత్త వంటలను తయారు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన యూట్యూబ్ ద్వారా 1.5 మిలియన్ల సబ్ స్క్రైబర్లను కలిగిఉన్నాడు. అంతేకాదు.. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో అతను సొతంగా ఇల్లు కూడా కట్టుకున్నాడు.

Also Read : అలెక్సాతో ఇలా ప్రాణాలు కాపాడుకున్న బాలిక.. ఆమె తెలివికి మెచ్చి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్ర

ఆనంద్ మహీంద్రా ట్వీట్ ప్రకారం.. మీ వయస్సు, మీ వృత్తితో సంబంధం లేకుండా కొత్త సాంకేతికతకు అనుగుణంగా మిమ్మల్ని మీరు పునరుద్ధరించుకోవాలని సూచించారు. రాజేష్ రావనీ జీవితం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయంలాంటిందని, అతనే నా సోమవారం ప్రేరణ అంటూ  ఆనంద్ మహీంద్ర పేర్కొన్నాడు. అంతేకాక తన ట్విటర్ ఖాతాలో రాజేష్ రావనీ ట్రక్ క్యాబినెట్ లో చికెన్ కర్రీ చేస్తున్న వీడియోను మహీంద్ర షేర్ చేశారు. ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.