Viral Video : కూల్ డ్రింక్ వ్యాపారి టాలెంట్‌కి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. టాలెంట్ ఎన్నో రకాలుగా ఉంటుందంటూ పోస్ట్
ఆనంద్ మహీంద్రా రీసెంట్‌గా ఓ కూల్ డ్రింక్ వ్యాపారి డ్రింక్ తయారు చేస్తున్న వీడియో షేర్ చేసారు. అతని టాలెంట్ మెచ్చుకున్నారు. ఆ వీడియోలో ఏముంది?

Viral Video
Viral Video : వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆసక్తికరమైన వీడియోలు పోస్టు చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా పోస్టు చేసిన కూల్ డ్రింక్ వ్యాపారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Anand Mahindra : ఆనంద్ మహీంద్రాకు బాధ కలిగించిన వీడియో.. అందులో ఏముందంటే?
ఆనంద్ మహీంద్రా టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తుంటారు. ప్రత్యేకంగా కనిపించిన వీడియోలు పోస్టులు షేర్ చేస్తుంటారు. కొన్నింటికి స్పందించడమే కాదు.. సాయం కూడా చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రాని ఓ డ్రింక్ వెండర్ స్కిల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక సాధారణమైన వీధి దుకాణంలో డ్రింక్స్ అమ్ముతున్న ఓ వ్యాపారి వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసారు.
ఇటీవల కాలంలో ఏదైనా తినే, తాగే ఫుడ్ రుచి ఎలా ఉంది? అనే దాని కంటే దానిని ఎలా తయారు చేస్తున్నారో చూపించే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటిదే ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో. వీడియోలో ఓ వ్యాపారి పానీయం తయారు చేసే విధానం మొత్తం గారడీ చేస్తున్నట్లు అనిపిస్తుంది. గ్లాసుని గాల్లో విసురుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ డ్రింక్‌ను అద్భుతంగా మిక్స్ చేస్తున్నట్లు కనిపించింది. వీడియో చివర్లో పానీయం అందిస్తాడు.
Anand Mahindra : ఈ ట్రాక్టర్ ఎందుకిలా ఉంది? ఈ డౌట్ ఆనంద్ మహీంద్రాకే కాదు మీకూ వస్తుంది
ఈ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ‘ ఈ పెద్ద మనిషి నూతన సంవత్సర వేడుకలో బార్టెండర్ కాదు.. కానీ అతను ఖచ్చితంగా చేయగలడు.. ప్రతిభ అన్ని రకాలుగా ఉంటుంది. టామ్ క్రూజ్‌ని తల్చుకోండి. ( కాక్ టెయిల్ సినిమాలో క్రూజ్‌ని గుర్తు తెచ్చుకోండి’ అని రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని ప్రతిభ అమోఘం అని కొందరు మెచ్చుకున్నారు. అయితే డ్రింక్ తయారు చేసేటపుడు వేస్టేజీ ఎక్కువ కనిపించిందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
No this gentleman wasn’t the bartender at a New Year’s Eve party—but he certainly could and should have been! Talent comes in all forms. ??????Move over Tom Cruise… (remember Cruise in the film Cocktail? ) pic.twitter.com/CRPBzliu4g
— anand mahindra (@anandmahindra) January 2, 2024