టిక్ టాక్ వీడియో కోసం..జీపునే తగులబెట్టాడు

  • Published By: venkaiahnaidu ,Published On : September 3, 2019 / 11:38 AM IST
టిక్ టాక్ వీడియో కోసం..జీపునే తగులబెట్టాడు

Updated On : September 3, 2019 / 11:38 AM IST

రోజురోజుకి టిక్ టాక్ పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లిపోతుంది. ఈ యాప్ మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే…మరికొందరు మాత్రం తమ వీడియోలకు ఎక్కువ వ్యూస్, లైకులు రావాలని… సొంత ఆస్తుల్ని సైతం తగలబెట్టుకుంటున్నారు. గుజరాత్‌లో ఒక వ్యక్తి టిక్ టాక్ వీడియో కోసం ఇలాంటి ఘనకార్యమే చేశాడు. 

రాజ్‌కోట్‌లోని కొథారియా రోడ్డు రద్దీగా ఉండే ప్రాంతం. బిజీ బిజీగా జనం, అటు ఇటూ తిరుగుతున్నారు. వాహనాలు కూడా బాగానే రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఫైరింజన్ ఆఫీస్ కూడా ఆ రోడ్డులో ఉంది. ఇంతలో ఒక యువకుడు ఆ ఆఫీస్ ఎదుట చూడటానికి ఎంతో చక్కగా ఉండే తన జీపును నిలబెట్టాడు. అందరూ చూస్తుండగానే.. పెట్రోల్ పోసి తన వెహికల్‌ను తగలబెట్టేశాడు.దీ నిని మరోవ్యక్తి వీడియో తీశాడు. జీపుకు మంటలు అంటుకున్న దృశ్యాన్ని చూసిన అక్కడున్నవారు తమ వాహనాలను కాపాడుకునే ప్రయత్నాన్ని చేస్తుండటం గమనించవచ్చు.

ఈ వీడియోలో డైలాగ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని ఇంద్రజీత్ సింగ్ జడేజాగా పోలీసులు గుర్తించారు. ఇంద్రజీత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జీపును ఎందుకు తగలబెట్టావంటూ ఆరా తీశారు. అతడు చెప్పిన కారణం విని పోలీసులు సైతం షాక్ అయ్యారు. టిక్ టాక్ వీడియో కోసమే ఇదంతా చేశానన్నాడు ఇంద్రజీత్. ఈ తతంగాన్ని మొత్తం  వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన అతడి స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.