బెంగళూరులో మరో కరోనా కేసు.. గూగుల్ ఉద్యోగికి పాజిటివ్
బెంగళూరులో మరో కరోనా కేసు నమోదు అయింది. గూగుల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది.

బెంగళూరులో మరో కరోనా కేసు నమోదు అయింది. గూగుల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తోన్న కరోనా వైరస్… భారత్‌లో 75 మందికి సోకింది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట కొత్త కేసులు బైటపడుతున్నాయ. దీంతో దేశంలో కోవిడ్ 19 వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోందనే భయాందోళన నెలకొంది. తాజాగా బెంగళూరులో మరో కరోనా కేసు నమోదు అయింది. గూగుల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఐసోలేషన్ వార్డులో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు.
భారత్‌లో తొలి కరోనా మృతి నమోదైంది. కర్ణాటక వాసి హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి.. చనిపోయినట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఇదే భారత్‌లో నమోదైన తొలి కరోనా మృతి కావడం విచారకరం. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన వ్యక్తి మరణంతోపాటు భారత్‌లో ఇప్పటివరకూ 74 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు భయపడొద్దని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.
భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుందనే సందేహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 70 దాటిన కరోనా వైరస్ కేసులు రానున్న రోజుల్లో ఇంకా పెరిగితే ఏం చేయాలనే ఆందోళన అందరిలో మొదలైంది..భారీ జనసమ్మర్దం ఉన్న భారత్‌లో వైరస్ పుట్ట కనుకు పగిలితే పరిస్థితి ఊహించడానికే దారుణంగా మారుతుంది..దీన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్రం రంగంలోకి దిగింది. రాష్ట్రప్రభుత్వాలకు సూచనలు పంపింది. విదేశాలకు వెళ్లవద్దని సూచించింది. అలానే దేశంలోకి వచ్చేవారి వీసాలను రద్దు చేసింది.
మరోవైపు ప్రధాని మోదీ కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేశారు..ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు..అసలు కేంద్రానికి కరోనాని ఎదుర్కొనే సన్నద్ధత లేదంటూ విమర్శించారు.(ఇటలీలో కరోనా మృత్యుఘోష.. నిన్న ఒక్కరోజే 189 మంది చనిపోయారు)
మరోవైపు పరిస్థితి తీవ్రతని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో షట్ డౌన్ అమలు చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. సినిమా హాళ్లు, స్కూళ్లకి సెలవులు ప్రకటించింది..ఒక్క గురువారమే..మహారాష్ట్రలో 9, ఢిల్లీ 1, లడఖ్ 1, యూపీ 1, ఆంధ్రప్రదేశ్ లో ఒక కేసు నమోదు అవగా..దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. మరోవైపు పాజిటివ్ నిర్ధారణ అయిన పేషెంట్లందరికీ ఐసోలేషన్ వార్డులలో చికిత్స అందిస్తున్నారు
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షా 25 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా..4500మంది చనిపోయారు. మరోవైపు వైరస్ విలయతాండవం చేస్తోన్న ఇరాన్‌లో 6వేలమంది భారతీయులు చిక్కుకుపోయారు..వీరిలో మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్ కి చెందినవారే 1100మంది ఉన్నారు..ఇప్పటిదాకా 948మంది భారతీయులను విదేశాలనుంచి రప్పించిన విదేశాంగశాఖ తొందర్లోనే మిగిలినవారిని కూడా రప్పించేందుకు ప్రయత్నాలు మమ్మురం చేసింది.