Cyclone : మరో తుఫాన్ ముప్పు

గులాబ్ తుఫాన్ బీభత్సం నుంచి కోలుకోకముందే మరో ముప్పు పొంచివుంది. మరో తుఫాన్ విజృంభించడానికి సిద్ధమవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Cyclone : మరో తుఫాన్ ముప్పు

Cyclone

Updated On : September 29, 2021 / 9:28 PM IST

Another cyclone threat : గులాబ్ తుఫాన్ బీభత్సం నుంచి కోలుకోకముందే మరో ముప్పు పొంచివుంది. పశ్చిమ తీరంలో మరో తుఫాన్ విజృంభించడానికి సిద్ధమవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఈ తుఫాన్ ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉదయం ఈ తుఫాన్ ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ఏపీలో తీరం దాటిన సంగతి తెలిసిందే.

గులాబ్ తుఫాన్ ముగిసినప్పటికీ ఈదురుగాలుల ప్రభావం ఇంకా ఉందని, అవి ఏపీ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా ప్రయాణించి ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం చేరాయని ఐఎండీ పరిశోధకులు వివరించారు. ఈదురుగాలుల కారణంగా గుజరాత్‌పై అల్పపీడనం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఇది తర్వాత తుఫాన్ మారనుంది. దీనికి ‘సైక్లోన్ షహీన్’ అని నామకరణం చేశారు. ఈ పేరును కతార్ సూచించింది.

Gulab Cyclone : ఏపీని గజగజలాడిస్తున్న గులాబ్‌!

అయితే ఈ తుఫాన్ భారత్‌పై పెద్దగా ప్రభావం చూపించబోదని పరిశోధకులు అంటున్నారు. ఇది పాకిస్తాన్ వైపు వెళ్లనుందని తెలిపారు. కాగా భారీ వర్షాల కారణంగా ఉత్తర కొంకణ్‌, గుజరాత్, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో 24 గంటలపాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు.