NIA Raids : ఉగ్రవాద నెట్ వర్క్ కేసులో ఎన్ఐఏ దాడులు

దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆకస్మిక దాడులు చేసింది. కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలోని ఉగ్రవాద నెట్ వర్క్ లో భాగంగా 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది.....

NIA Raids : ఉగ్రవాద నెట్ వర్క్ కేసులో ఎన్ఐఏ దాడులు

NIA Raids

NIA Raids : దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆకస్మిక దాడులు చేసింది. కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలోని ఉగ్రవాద నెట్ వర్క్ లో భాగంగా 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. ఉగ్రవాద నెట్ వర్క్ లోని అనుమానితుల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే 11 ప్రాంతాల్లో ఎన్ఐఏ ముమ్మర దాడులు చేసింది.

ALSO READ : Union Minister Giriraj Singh : హిందువులు ఝట్కా మాంసాన్ని మాత్రమే తినాలి…కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ఉగ్రవాదులతో సంబంధాలు, ఉగ్రవాద కుట్ర, ఉగ్రవాదులకు ఆర్థిక వనరుల సమకూర్చడంపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.జిహాది ఉగ్రవాద సంస్థ సభ్యులపై ఈ దాడులు జరిగాయి. ఎన్ఐఏ అధికారులు వివిధ రాష్ట్రాల పోలీసులతో కలిసి ఈ దాడులు చేసింది. ఉగ్రవాద సంస్థల్లో యువతను రిక్రూట్ చేసుకోవడం, ఉగ్రదాడులకు వ్యూహాలు రూపొందించారని వచ్చిన వార్తలతో ఎన్ఐఏ దాడులు చేసింది.

ALSO READ : Heavy rains : తమిళనాడును ముంచెత్తుతున్న భారీవర్షాలు

పరారీలో ఉన్న నలుగురు ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు తనిఖీ చేశారు. డిసెంబరు 13వతేదీన కూడా ఎన్ఐఏ దాడులు చేసింది. ఈ దాడుల్లో రూ.7.3లక్షల నగదుతోపాటు కీలకమైన డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజులను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ :  Covid deaths : దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు.. అయిదుగురి మృతి

ముహమ్మద్ ఉమర్, ముహమ్మద్ ఫైజల్ రబ్బానీ, తన్వీర్ అహ్మద్, మహ్మద్ ఫారూఖ్, జునైద్ అహ్మద్ ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు జరిపారు. వీరిలో జునైద్ అహ్మద్ తోపాటు ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎన్ఐఏ అధికారులు వివరించారు.