Covid deaths : దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు.. అయిదుగురి మృతి

భారతదేశంలో మళ్లీ కొవిడ్ కేసులు ప్రబలుతున్నాయి. దేశంలో తాజాగా 335 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మహమ్మారితో బాధపడుతున్న అయిదుగురు మరణించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేరళ రాష్ట్రంలో నలుగురు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకరు కరోనాతో మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది.....

Covid deaths : దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు.. అయిదుగురి మృతి

Covid

Updated On : December 18, 2023 / 10:16 AM IST

Covid deaths : భారతదేశంలో మళ్లీ కొవిడ్ కేసులు ప్రబలుతున్నాయి. దేశంలో తాజాగా 335 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మహమ్మారితో బాధపడుతున్న అయిదుగురు మరణించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేరళ రాష్ట్రంలో నలుగురు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకరు కరోనాతో మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది. ఆదివారం 335 కొవిడ్ కేసులు వెలుగుచూడటంతో మొత్తం కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 1701కి పెరిగింది.

ALSO READ : COVID-19 sub variant JN.1 : కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి…కర్ణాటకలో హైఅలర్ట్

దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్‌ల కొవిడ్ -19 వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మొత్తంమీద ఇప్పటివరకు దేశంలో నాలుగున్నర కోట్లమందికి కరోనా సోకిందని వెల్లడైంది. కొవిడ్ కారణంగా దేశంలో మొత్తం 5,33,316 మంది మరణించారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాపించిందని వైద్యాధికారులు చెప్పారు. కేరళ రాష్ట్రానికి చెందిన 79 ఏళ్ల మహిళకు కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 సోకిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సీనియర్ అధికారి తెలిపారు.

ALSO READ : Union Minister Giriraj Singh : హిందువులు ఝట్కా మాంసాన్ని మాత్రమే తినాలి…కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

డిసెంబర్ 8న దక్షిణాది రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాలోని కరకుళం నుంచి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ శాంపిల్‌లో ఈ కేసు కనుగొన్నామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ తెలిపారు. కేరళ రాష్ట్రంలో కనుగొన్న కొవిడ్ -19 సబ్-వేరియంట్ జేఎన్.1 అయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు.

ALSO READ : Dawood Ibrahim : అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం…ఆసుపత్రిలో చేరిక

సింగపూర్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేసిన భారతీయ ప్రయాణీకుల్లో సబ్-వేరియంట్ కనుగొన్నామని మంత్రి చెప్పారు. ఇతర రోగాలు ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి వీణా జార్జ్ కోరారు.