COVID-19 sub variant JN.1 : కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి.. కర్ణాటకలో హైఅలర్ట్
దేశంలో కొవిడ్ -19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. పొరుగున ఉన్న కేరళలో పెరుగుతున్న కొవిడ్-19 కేసులు, కర్ణాటకలో స్వల్పంగా కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రం హై అలర్ట్‌లో ఉంది....

COVID-19 sub variant JN.1
COVID-19 sub variant JN.1 : దేశంలో కొవిడ్ -19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. పొరుగున ఉన్న కేరళలో పెరుగుతున్న కొవిడ్-19 కేసులు, కర్ణాటకలో స్వల్పంగా కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రం హై అలర్ట్‌లో ఉంది. కొవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు అధికారులతో సమావేశమయ్యారు.
కరోనా కొత్త సబ్ వేరియంట్ తో ఒక రోగి మృతి
కొత్త కొవిడ్-19 సబ్ వేరియంట్ ప్రభావంపై చర్చించేందుకు కొవిడ్-19 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) డిసెంబర్ 19వతేదీన సమావేశమవుతుందని మంత్రి తెలిపారు. జేఎన్.1, బీఏ.2.86 సబ్ వేరియంట్ కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కనుగొన్నారు. కర్ణాటకలో 58 కొవిడ్ క్రియాశీల కేసులు నమోదయ్యాయి. 11 ఆసుపత్రుల్లో కరోనా రోగులను ఐసీయూ వార్డుల్లో ఉంచారు. మరికొందరు హోం ఐసోలేషన్ లో ఉంచారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో కరోనాతో ఓ రోగి మరణించారు.
ALSO READ : హిందువులు ఝట్కా మాంసాన్ని మాత్రమే తినాలి…కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ ప్రబలకుండా కేరళ రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా పెంచామని మంత్రి చెప్పారు. కేరళ సరిహద్దు జిల్లాల్లో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలుంటే తగిన పరీక్షలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించినట్లు మంత్రి గూండూరావు చెప్పారు. వచ్చే మూడు నెలలపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లును అందుబాటులో ఉంచాలని కర్ణాటక స్టేట్ మెడికల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
ALSO READ : చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే
కేంద్రం ఆదేశాల మేరకు కర్ణాటక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్‌ను ప్రారంభించారు. కొవిడ్-19 కేసుల నివారణకు కసరత్తు ప్రారంభమైంది. ఆసుపత్రుల్లో పడకల సామర్ద్యాన్ని పెంచి ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మెడికల్ ఆక్సిజన్, టెలీమెడిసిన్ సేవలను అందుబాటులో ఉంచామని మంత్రి వివరించారు. కొవిడ్ కొత్త వేరియంట్ ను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీటీ 25 కంటే తక్కువ ఉన్న కొవిడ్-19 పాజిటివ్ కేసుల నమూనాలను బీఎంసీఆర్‌ఐకి పంపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.