దేశ బలగాలను స్వార్థపూరిత రాజకీయాలు కోసం వాడుతున్నారు

తమ పార్టీ రాజకీయ లబ్ధి కోసం భారత్ ఆర్మీని వాడుకుంటున్నారని ఎన్డీయేతర పార్టీ నేతలు ఆరోపించారు. దేశ భద్రత విషయంలో ఇటువంటి చర్యలు ఏంటని ప్రశ్నించారు. ఎన్డీయేతర పార్టీలంతా పార్లమెంటరీ లైబ్రరీ హాల్‌లో సమావేశమైయ్యారు. రాబోయే ఎన్నికలు, దేశంలో హాట్ టాపిక్‌గా మారిన పాక్‌తో దాడులు గురించి చర్చించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలంతా ముచ్చటించారు.
పుల్వామా దాడిని ఖండిస్తూనే పాక్‌పై భారత వైమానిక దళాల చర్యలను 21 పార్టీల నేతలు కొనియాడారు. ఎయిర్ ఫోర్స్ దళాలు ధైర్యంగా పోరాడతున్నాయని అభినందించారు. అదే సమయంలో భద్రతా దళాలను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని నేతలంతా ముక్త కంఠంతో ఖండించారు. స్వార్థ రాజకీయాల కోసం జాతి భద్రతను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. అధికార పక్షాన్ని పరోక్షంగా ఖండిస్తూ.. ప్రధాని మోడీ ప్రజాస్వామ్యానికి లోబడి వ్యవహరించలేదని విమర్శించారు. అదే విధంగా పాక్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆరోపిస్తూనే జాతి ప్రయోజనాలను స్వార్థం కోసం పణంగా పెడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు.
మీడియా సమావేశంలో భారత దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆ పార్టీ సీనియర్ నేతలు ఆజాద్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు మరికొందరు ముఖ్య నేతలు పాల్గొన్నారు.