Army Helicopter Crash: జమ్మూ కాశ్మీర్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ..
అటవీ ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్ సైన్యానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్. గత రెండు నెలల్లో ఏఎల్‌హెచ్ ధృవ్‌కి సంబంధించిన మూడవ ప్రమాదం.

Army Helicopter Crash
Army Helicopter Crash: ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్వార్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని మారుమూల ప్రాంతమైన మాడ్వాలోని మచ్నా అడవుల్లో ఈ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయినట్లు ఆర్మీ అధికారి తెలిపారు. ఈ హెలికాప్టర్‌లో ప్రమాద సమయంలో పైలట్, కో పైలట్ ఉన్నారు. వారు గాయాలతో బయటపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
Army Helicopter Crashed : అరుణాచల్‌ప్రదేశ్‌లో కూలిన ఆర్మీ హెలిక్యాప్టర్.. పైలట్ మృతి
హెలికాప్టర్‌లో ఉన్నది ముగ్గురు అని తొలుత ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే, మూడో వ్యక్తి ఏమైనట్లు అనే సమాచారం ఇంకా తెలియరాలేదు. నిజంగానే హెలికాప్టర్‌లో మూడో వ్యక్తి ఉన్నారా? అనే విషయంపైనా క్లారిటీ రావాల్సి ఉంది.
Army Helicopter Crash: కూలిన ఆర్మీ హెలికాప్టర్ .. పైలట్, కో-పైలట్‌కోసం కొనసాగుతున్న గాలింపు
అటవీ ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్ సైన్యానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్. గత రెండు నెలల్లో ఏఎల్‌హెచ్ ధృవ్‌కి సంబంధించిన మూడవ ప్రమాదం ఇది. ఈ ఏడాది మార్చి నెల ప్రారంభంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని మండల హిల్స్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చీతా హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించిన విషయం విధితమే.