Al-Qaeda-Human Bombs : యూపీలో మానవ బాంబులతో దాడికి ప్లాన్.. అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

రాష్ట్రంలో ఆల్ ఖైదాతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ మానవ బాంబులుగా ట్రైనింగ్ తీసుకున్నట్టు సమాచారం ఉందని ATS వెల్లడించింది.

Al-Qaeda-Human Bombs : యూపీలో మానవ బాంబులతో దాడికి ప్లాన్.. అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

Arrested Al Qaeda Linked Terrorists Were Planning To Use Human Bombs

Updated On : July 12, 2021 / 11:29 AM IST

Al-Qaeda-Human Bombs : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆల్ ఖైదాతో సంబంధిత ఇద్దరు ఉగ్రవాదులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు వీరిద్దరూ మానవ బాంబులుగా ట్రైనింగ్ తీసుకున్నట్టు సమాచారం ఉందని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) వెల్లడించింది. ఆల్ ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ గజ్వాట్ ఉల్-హింద్‌తో వీరికి సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. మిన్హాజ్ అహ్మద్, మజీరుద్దీన్ ఇద్దరు ఉగ్రవాదులు సహా ఏడుగురు ఇంట్లో ఉన్నట్టు సమాచారంతో ATS బృందం దాడులు చేసింది.

ఈ క్రమంలో అయిదుగురు ఉగ్రవాదులు పారిపోగా.. మరో ఇద్దరని పట్టుకున్నట్టు చెప్పారు. వీరిద్దరూ ఉగ్రవాద సంస్థకు చెందిన హాజ్‌గా గుర్తించారు. ఇద్దరి నుంచి రెండు లైవ్ (ప్రెషర్ కుకర్) బాంబులు, డిటొనేటర్, 6 నుంచి ఏడు కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వచ్చే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రాష్ట్రంలోని లక్నో సహా పలు నగరాల్లో ఉగ్రవాద చర్యలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందడంతో దాడులు చేసినట్టు వెల్లడించారు.

రాష్ట్రంలోని సీతాపూర్, బారాబంకీ, ఉన్నావ్, రాయ్ బరేలీ తదితర జిల్లాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. పారిపోయిన మిగతా టెర్రరెస్టుల కోసం రాష్ట్రంలోని పలు నగరాల్లో విస్తృతంగా దాడులు చేస్తున్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరు ఉగ్రవాదులను కోర్టు ఎదుట హాజరపర్చనున్నారు. అనంతరం పోలీసులు వారిద్దరిని పోలీసు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.