అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు కరోనా

  • Published By: venkaiahnaidu ,Published On : September 15, 2020 / 09:32 PM IST
అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు కరోనా

Updated On : September 15, 2020 / 9:38 PM IST

అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండుకు మంగళవారం కరోనా సోకింది. తాను కరోనా పరీక్ష- RT-PCR చేయించుకోగా పాజిటివ్‌ గా రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. డాక్టర్ల సూచన ప్రకారం హోం ఐసొలేషన్‌లో ఉంటున్నట్లు పెమా ఖండు ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా మార్గదర్శకాలు పాటించాలని సూచించారు.


అరుణాచల్ ప్రదేశ్‌‌లో కరోనా కేసుల సంఖ్య ఇటీవల పెరుగుతున్నది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఆరు వేలు దాటగా 11 మంది మరణించారు.