Madhya Pradesh Elections: ఎన్నికల వేళ హామీల వర్షం.. కేజ్రీవాల్ ఏమేం ప్రకటించారో తెలుసా?
తెలంగాణలోనూ ప్రధాన రాజకీయ పార్టీలు ఇటువంటి హామీలే ఇచ్చే అవకాశం ఉంది.

Arvind Kejriwal
Madhya Pradesh Elections – 2023: మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు హామీల వర్షాలు కురిపిస్తున్నాయి. కర్ణాటకలో హామీలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో అటువంటి ప్రణాళికనే మధ్యప్రదేశ్ లోనూ వేసుకుంటున్నాయి కొన్ని పార్టీలు. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎన్నికల హామీలు ఇచ్చారు.
మధ్యప్రదేశ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి నెల ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రాష్ట్రంలోని ప్రతి బాలుడు, బాలికకు ఉచిత విద్య అందిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. నిరుద్యోగ యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అన్నారు.
ఉద్యోగ నియామకాల్లో సిఫార్సులు, అవినీతి లేకుండా చేస్తామని చెప్పారు. ఆరోగ్య రంగంలోనూ ఉద్యోగ నియామకాలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వ బడులను బాగుచేస్తామని, ప్రైవేటు బడుల్లో అక్రమంగా ఫీజులు పెంచకుండా కట్టడి చేస్తామని తెలిపారు. నగరాలతో పాటు గ్రామాల్లో 24 గంటలూ విద్యుత్ అందేలా చేస్తామని అన్నారు. కాగా, తెలంగాణలోనూ పార్టీలు ఇటువంటి హామీలే ఇచ్చే అవకాశం ఉంది.
Uttar Pradesh: యూపీలో అమానవీయ ఉన్మాదం.. 5 ఏళ్ల చిన్నారిని కిరాతకంగా చంపిన సాధువు