Union Minister Prahlad Patel : ఢిల్లీ సీఎం జాతీయ జెండాను అవమానించారు

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జాతీయ జెండాను అమానిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ఆరోపించారు.

Union Minister Prahlad Patel : ఢిల్లీ సీఎం జాతీయ జెండాను అవమానించారు

Arvind Kejriwal Insulted Tricolourclaims Culture Minister Prahlad Patel

Updated On : May 28, 2021 / 7:48 PM IST

Union Minister Prahlad Patel ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జాతీయ జెండాను అమానిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ఆరోపించారు. ఇటీవల కేజ్రీవాల్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్సుల్లో ఆయన కూర్చున్న కుర్చీ వెనుక ఉన్న జాతీయ జెండాల్లో..ఆకుపచ్చ రంగును పెద్దదిగా చేసి వక్రీకరించారని, మధ్యలో ఉండే తెలుపుదనాన్ని తగ్గించారని, ఇది దేశ జాతీయ జెండా నియమావళికి విరుద్ధమని కేంద్రమంత్రి అన్నారు. ఈ విషయాన్ని తెలిసో,తెలియకో పట్టించుకోని సీఎం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని చెప్పారు

ఇక,ఈ పొరపాటును తక్షణమే సరిదిద్దాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రహ్లాద్ పటేల్ …కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ కు ఓ లేఖ రాశారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ టెలివిజన్‌ బ్రీఫింగ్‌ లో ప్రసంగించినప్పుడల్లా తన దృష్టి ఆయన కుర్చీ వెనుకలా ఉన్న జాతీయ జెండానే ఆకర్షిస్తుందని..ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. అలంకారం కోసం జాతీయ జెండాలను ఉపయోగిస్తున్నారని ప్రహ్లాద్‌ పటేల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.