Free Food For Homeless : నిరాశ్రయుల కోసం ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్

దేశ రాజధానిలో నిరాశ్రయులకు కేజ్రీవాల్ సర్కార్ అండగా నిలిచింది.

Free Food For Homeless : నిరాశ్రయుల కోసం ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్

Kejriwal

Updated On : August 8, 2021 / 9:54 PM IST

Free Food For Homeless దేశ రాజధానిలో నిరాశ్రయులకు కేజ్రీవాల్ సర్కార్ అండగా నిలిచింది. ఢిల్లీ వ్యాప్తంగా.. ఇల్లు లేని నిరుపేదల కోసం నడుపుతున్న ప్రభుత్వ షెల్టర్లలో తలదాచుకునేవారి కోసం ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రారంభించారు.

అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా సరాయ్ కాలే ఖాన్ వద్ద షెల్టర్ హోమ్ కాంప్లెక్స్‌లోని వారికి ఆహారాన్ని స్వయంగా వడ్డించారు కేజ్రీవాల్. అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో కలిసి ఢిల్లీలోని అన్ని ఆశ్రయ గృహాలలో ఉచితంగా వండిన భోజనాన్ని శాశ్వతంగా పంపిణీ చేసే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కేజ్రీవాల్ తెలిపారు.

ఢిల్లీలోని 209 ప్రభుత్వ షెల్టర్‌ హోమ్స్‌లో ఆశ్రయం పొందే పేదలకు ఈ కార్యక్రమం కింద ఉచితంగా ఆహారాన్ని అందిస్తామని కేజ్రీవాల్‌ తెలిపారు. ప్రస్తుతం సుమరు 6 వేల మందికి ఆహారం అందిస్తున్నామని, శీతాకాలంలో ఈ సంఖ్య 12 వేలు అవుతుందని తెలిపారు. షెల్టర్‌ హోమ్‌లో ఉండే వారు అత్యంత పేదలని, ఓటు బ్యాంక్‌ కాని వీరిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని కేజ్రీవాల్‌ విమర్శించారు. తమది బాధ్యత కలిగిన ప్రభుత్వమని, అందుకే పేదల కోసం చాలా చేసినట్లు చెప్పారు.