మోడీ అబద్దాలు చెప్పడంలో దిట్ట : బాబుకు కేజ్రీ సపోర్టు

ఢిల్లీ : భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ అబద్దాలు చెప్పడంలో దిట్ట అని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశ రాజధాని వేదికగా ఫిబ్రవరి 11వతేదీ సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు చేపడుతున్న ధర్మపోరాట దీక్షకు ఆయన మద్దతు పలికారు. ఈ సందర్భంగా బాబుకు సపోర్టు తెలియచేస్తున్నట్లు..ఏపీ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మోడీ విధానాలపై పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రం నుండి బాబు..నేతలు ప్రజల తరపున ఇక్కడకు వచ్చి ఆందోళన చేయడం బాధాకరమన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని బహిరంగంగా మోడీ వ్యాఖ్యానించారని…ఆయన అబద్దాలు చెప్పడంలో దిట్ట అని ఎద్దేవా చేశారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా హోదా గురించి వ్యాఖ్యానించి…వెనక్కి అడుగు వేయడం బాధాకరమని…ఆయన చెప్పేవి పూర్తి చేయరని వ్యాఖ్యానించారు.
బాబు చేస్తున్న దీక్ష న్యాయమైందని…ఢిల్లీ ప్రభుత్వం..హస్తిన వాసులు ఏపీకి అండగా ఉంటామని హామీనిచ్చారు. దేశ ప్రజల కోసం ప్రధానిగా ఉన్నారని…బీజేపీకి కాదని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా ఒక పార్టీకి కాదని..ప్రజల కోసమన్నారు. 40 సంవత్సరాల నుండి ఏసీబీ వ్యవస్థ ఢిల్లీ ముఖ్యమంత్రి కంట్రోల్‌లో ఉంటే…తాము అధికారంలోకి రాగానే మోడీ…పారామిలటరీ ఫోర్స్ ఉపయోగించి ఏసీబీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. కలకత్తా పోలీసు కమిషనర్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారని…దీనిని మమత ధైర్యంగా అడ్డుకోవడం గర్వనీయమన్నారు. వచ్చే ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అని పేర్కొన్న కేజ్రీవాల్..మోడీ..షా ద్వయం మరలా వస్తే దేశం ప్రమాదంలో పడుతుందన్నారు.