Rajasthan: గుజరాత్ ఎన్నికల హామీ ఎఫెక్ట్? గ్యాస్ సిలిండర్ ధరను సగానికి తగ్గించిన రాజస్తాన్ ప్రభుత్వం
రాజస్తాన్ రాష్ట్రంలో తాజాగా ఇలాంటిదే జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ప్రస్తుతం రాజస్తాన్‌లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఒకటి. వడ్డీ వ్యాపారం కంటే వేగంగా పెరిగిన గ్యాస్ ధరల పెరుగదలపై వ్యతిరేకతను అటు విపక్షాల నుంచి ఇటు ప్రజల నుంచి బీజేపీ తరుచూ ఎదుర్కొంటోంది

Ashok Gehlot Slashes LPG Cylinder Prices To Less Than Half In Rajasthan
Rajasthan: ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు అనేక హామీలు ఇస్తుంటారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకోరు. ఆదాయం, సాధ్యాసాధ్యాలు లాంటివి ఏమాత్రం పట్టించుకోకుండా గెలుపు కోసం ఎడాపెడా ఇచ్చే హామీలే ఎక్కువ. అందుకే చాలా హామీలు ఆచరణలోకి రాకుండానే కనురుగవుతుంటాయి. ఒక్కోసారి పాత హామీలు గుర్తు చేసుకుని అమలు చేస్తుంటారు. ప్రజల నుంచి డిమాండ్ రావడం కొన్నిసార్లు ప్రభావితం చేస్తే.. వారి రాజకీయ భవిష్యత్ కోసం వాటిని ఆచరణలోకి తీసుకువస్తుంటారు. కానీ, ఒక చోట చేసిన హామీని మరొక చోట అమలు చేయడం ఎప్పుడైనా చూశారా?
రాజస్తాన్ రాష్ట్రంలో తాజాగా ఇలాంటిదే జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ప్రస్తుతం రాజస్తాన్‌లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఒకటి. వడ్డీ వ్యాపారం కంటే వేగంగా పెరిగిన గ్యాస్ ధరల పెరుగదలపై వ్యతిరేకతను అటు విపక్షాల నుంచి ఇటు ప్రజల నుంచి బీజేపీ తరుచూ ఎదుర్కొంటోంది. అయితే తాము అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ధరను 500 రూపాయలకు తగ్గిస్తామని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు.
Messi Income: లెజెండ్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ సంపాదన.. ఈ భూమ్మీద మరే ఆటగాడికీ లేదట!
అయితే ఈ హామీని గుజరాత్ పక్క రాష్ట్రమైన రాజస్తాన్‌లో అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం ప్రకటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ హామీ ఇచ్చినప్పుడు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని విపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. పైగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను అశోక్ గెహ్లాట్ తన భుజాల మీద వేసుకుని నడిపించారు. దీంతో రాజస్తాన్ రాష్ట్రంలో ఈ హామీ అమలుకు గెహ్లాట్ పూనుకున్నారు. అయితే ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ బాగానే మైలేజ్ రానుంది. ఓడినప్పటికీ హామీ నిలబెట్టుకున్నారనే సానుభూతితో పాటు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ప్రభావం బాగా పడనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.