Bijbehara Militant Attack : ఉగ్రవాదుల కాల్పుల్లో ASI మృతి

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.

Bijbehara Militant Attack : ఉగ్రవాదుల కాల్పుల్లో ASI మృతి

Kashmir8

Updated On : December 22, 2021 / 7:32 PM IST

Bijbehara Militant Attack :  జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసులు,పౌరులు,జవాన్లు లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నారు. బుధవారం జమ్మూకశ్మీర్ లో రెండు వేర్వేరు ఘటనల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి,ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు.

బుధవారం సాయంత్రం అనంతనాగ్ జిల్లాలోని బిజ్ బెహరా ఏరియాలో ఆయుధాలు చేతబట్టుకొని వచ్చిన కొందరు ఓ పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ పై కాల్పులు జరిపారు. ఆగంతకుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సబ్ ఇన్స్ పెక్టర్ ని హాస్పిటల్ కు తరలించగా,అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించినట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన పోలీస్ ని అవంతిపొరాకు చెందిన మొహమ్మద్ అష్రఫ్ గా గుర్తించారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు,ఇవాళ సాయంత్రమే శ్రీనగర్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 45 ఏళ్ల రౌష్ అహ్మద్ అనే స్థానిక  పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.

ALSO READ Terrorists kill Civilian : శ్రీనగర్ లో పౌరుడిని కాల్చి చంపిన ఉగ్రవాదులు