రెండు ఛానళ్లపై నిషేధం ఎత్తివేత

  • Published By: madhu ,Published On : March 7, 2020 / 04:39 AM IST
రెండు ఛానళ్లపై నిషేధం ఎత్తివేత

Updated On : March 7, 2020 / 4:39 AM IST

కేంద్ర ప్రభుత్వంలోని I&B మినస్ట్రీ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు ఛానళ్లపై నిషేధం విధించింది. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఢిల్లీలో చెలరేగిన హింస దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 53 మంది మృతి చెందగా వందల మందికి గాయాలయ్యాయి. అయితే…2020, మార్చి 07వ తేదీ శనివారం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 48 గంటల నిషేధాన్ని ఎత్తివేసింది. 

అయితే..ఈ అల్లర్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్రసారాలు చేసినందుకు Asianet And Media One ఛానెళ్లపై నిషేధం విధిస్తున్నట్లు I&B Ministry ప్రకటించింది. 48 గంటల పాటు ఇది కొనసాగుతుందని స్పష్టం చేసింది. శుక్రవారం రాత్రి 7.30గంటల నుంచి 48 గంటల పాటు రెండు ఛానళ్ల ప్రసారాలు ఆగిపోయాయి. తాజాగా నిషేధం ఎత్తివేయడంతో ప్రసారాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Read More : తిరుపతిలో కరోనా : రుయాలో చేరిన ఇద్దరు విదేశీయులు

ఇలాంటి కవరేజ్ చేయడం వల్ల…మరింత ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్ నిబంధనలు, 1994 ప్రకారం రెండు ఛానళ్లు నిబంధనలు ఉల్లంఘించాయని వెల్లడించింది. మతాలపై దాడులు, హింసను ప్రేరేపించే విధంగా, శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా రిపోర్టు ఉందని తెలిపింది. అందుకే బ్యాన్ చేసినట్లు ఆదేశాల్లో వెల్లడించింది. ఛానెళ్లపై నిషేధాన్ని ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ వ్యతిరేకించారు. ఛానెళ్లపై నిషేధం విధించడం, సెన్సార్ షిప్ వంటివి మంత్రిత్వ శాఖ, బ్యోరోక్రాట్లు చేయడం సరికాదన్నారు.