Viral News: అడ్రెస్ పేరుతో అసభ్య ప్రవర్తన.. దుమ్ముదులిపేసిన మహిళ!

మన సమాజంలో పోకిరి వెధవలకు ఏం తక్కువలేదు. అడుగడుగునా దాపురించే ఇలాంటి ఈ పోకిరి గాళ్ళతో అమ్మాయిలు, మహిళలు పలురకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇలాంటి వాటిని మహిళలు ధైర్యంగా ఎదుర్కొని పోరాడితేనే మార్పు వచ్చే అవకాశం ఉంది. తాజాగా అలాంటి ఓ పోకిరీకి మహిళ బుద్ధిచెప్పిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చి వైరల్ అయింది.

Viral News: అడ్రెస్ పేరుతో అసభ్య ప్రవర్తన.. దుమ్ముదులిపేసిన మహిళ!

Viral News

Updated On : August 2, 2021 / 7:23 PM IST

Viral News: మన సమాజంలో పోకిరి వెధవలకు ఏం తక్కువలేదు. అడుగడుగునా దాపురించే ఇలాంటి ఈ పోకిరి గాళ్ళతో అమ్మాయిలు, మహిళలు పలురకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇలాంటి వాటిని మహిళలు ధైర్యంగా ఎదుర్కొని పోరాడితేనే మార్పు వచ్చే అవకాశం ఉంది. తాజాగా అలాంటి ఓ పోకిరీకి మహిళ బుద్ధిచెప్పిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చి వైరల్ అయింది.

అస్సాం, గువహటికి చెందిన భావన కశ్యప్‌ జులై 30న రుక్మిణి నగర్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. రాజ్ కుమార్ అనే యువకుడు స్కూటీపై అటుగా వెళుతూ ఆమె దగ్గర ఆగాడు. భావనను రాజ్ కుమార్ ఏదో అడ్రస్‌ అడగ్గా అది ఆమెకు వినపడలేదు. దీంతో ఆమెకు మరికాస్త దగ్గరకు వచ్చిన రాజ్ కుమార్ మళ్ళీ అడ్రెస్ అడిగాడు. దానికి భావన తెలియదని చెప్పింది. ఇదే అదనుగా రాజ్ కుమార్ ఆమెను అసభ్యకరంగా తాకాడు.

దీంతో భావన షాకై ప్రతిస్పందించేలోగా రాజ్ కుమార్ అక్కడ నుండి జారుకొనేందుకు ప్రయత్నించాడు. కానీ.. భావన అతన్ని పట్టుకొనే క్రమంలో స్కూటీ కాలువలో ఇరుక్కుపోవడంతో పారిపోయేందుకు అవకాశం లేకుండా పోయింది. మొత్తానికి అతన్ని పట్టుకున్న భావన మాటలతోనే దుమ్ముదులిపేసి పోలీసులకు పట్టించింది. ఈ తతంగం మొత్తాన్ని మరో వ్యక్తి వీడియో తీయగా భావన వీడియోలతో పాటు జరిగిన విషయాన్ని పేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది.