బాబ్రీ మసీదు కూల్చివేత నిందితులకు రామమందిరం ట్రస్టులో కీలక పదవులు!

  • Published By: sreehari ,Published On : February 21, 2020 / 06:57 PM IST
బాబ్రీ మసీదు కూల్చివేత నిందితులకు రామమందిరం ట్రస్టులో కీలక పదవులు!

Updated On : February 21, 2020 / 6:57 PM IST

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులకు రామమందిర్ ట్రస్టు కీలక పదవుల్లో నియమించింది. ఫిబ్రవరి 19న ఢిల్లీలోని సీనియర్ న్యాయవాది, ట్రస్ట్ అధినేత కె.పరసరన్ నివాసంలో నృత్యా గోపాల్ దాస్ ట్రస్ట్ చైర్మన్, చంపత్ రాయ్ ప్రధాన కార్యదర్శిగా రామమందిర్ ట్రస్టు నియమించింది. మసీదు కూల్చివేతకు ముందు వీరిద్దరూ కర్ సేవకులుగా ట్రస్టు ప్రస్తావించింది.

అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని పర్యవేక్షిచేందుకు ఈ రెండు కీలక పదవులను ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఈ పదవుల్లో నృత్యా గోపాల్ దాస్, చంపత్ రాయ్ ఇద్దరూ ఒకప్పటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో సీబీఐ చార్జిషీట్ ప్రకారం.. మసీదు కూల్చివేయడానికి ముందే దాస్, బన్సాల్ ఇద్దరూ కర్ సేవకులుగా పేర్కొంది. 

అక్టోబర్ 5, 1993న దాస్, బన్సాల్ సహా 48 మందిపై సీబీఐ ఏకీకృత చార్జిషీట్ దాఖలు చేసింది. విశ్వ హిందూ పరిషత్ (VHP) అనుబంధ సంస్థ రామ్ జన్మభూమి న్యాస్ సీనియర్ సభ్యుడు మహంత్ కమల్ నయన్ దాస్  మాట్లాడుతూ..  దాస్ రాయ్ ట్రస్ట్‌లో భాగమని హోం మంత్రిత్వ శాఖ వారికి హామీ ఇచ్చిందన్నారు. దాస్, రాయ్ ఇద్దరూ ప్రాథమిక జాబితాలో లేరని తెలిపారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని పర్యవేక్షించే శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 15 మంది సభ్యులను కలిగి ఉంది. ఇందులో ఏడుగురు సభ్యులు, ఐదుగురు నామినేటెడ్ సభ్యులు, ముగ్గురు ధర్మకర్తలు ఉన్నారు. అయోధ్య భూ వివాదంపై నవంబర్ 2019 సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ట్రస్ట్ ఏర్పాటును ప్రకటించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దాస్, రాయ్ నిందితులు ఉన్నారు. ప్రస్తుతం వీరద్దరూ ఈ కేసులో బెయిల్ మీద బయట ఉన్నారు.