Rice Export Ban : నిషేధం ఎఫెక్ట్.. పోర్టుల్లో భారీగా పేరుకుపోయిన బియ్యం నిల్వలు, ఏమై ఉంటుందోనని ఆందోళన

బియ్యం ధరలు భారీగా పెరుగుతుండడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు జూలై 20న నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. Rice Export Ban

Rice Export Ban : నిషేధం ఎఫెక్ట్.. పోర్టుల్లో భారీగా పేరుకుపోయిన బియ్యం నిల్వలు, ఏమై ఉంటుందోనని ఆందోళన

Rice Export Ban(Photo : Google)

Updated On : August 2, 2023 / 4:35 PM IST

India Rice Export Ban : బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో కొత్త సమస్య తలెత్తింది. భారత్ లోని పోర్టుల్లో భారీగా బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. నిషేధం నిర్ణయం ప్రకటించడానికి ముందే పోర్టులకు తరలించిన బియ్యం ఎగుమతులకు వీలు లేకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

కార్గోలు, కంటైనర్ల నిండా బియ్యం బస్తాలే ఉన్నాయి. వీటిలో చాలా కార్గోలకు కస్టమ్స్ క్లియరెన్స్ ఉన్నప్పటికి కూడా నిషేధం నిర్ణయంతో ఎక్స్ పోర్టుకు వీలు లేకుండా పోయింది. మొత్తంగా 2లక్షల టన్నుల బియ్యం పోర్టుల్లో ఉన్నాయని అంచనా. ఒక్క కోల్ కతాలోనే శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టులోనే 5వేల టన్నుల బియ్యం నిలిచిపోయింది. మొత్తంగా లక్షల టన్నుల బియ్యం నిల్వలు పోర్టులో నిలిచిపోయాయని భావిస్తున్నారు.

Also Read..Flipkart Big Saving Days Sale : ఆగస్టు 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌.. ఐఫోన్ 14, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

బియ్యం ధరలు భారీగా పెరుగుతుండడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు జూలై 20న నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో భారీగా నిల్వలు పేరుకుపోయాయి.

గత ఏడాది భారత్ లో బియ్యం ధరలు 11శాతం పెరిగాయి. దీంతో ఎగుమతులపై నిషేధం విధించిన ప్రభుత్వం.. కేంద్ర ప్రత్యేక అనుమతులతో ఎగుమతులకు అవకాశం కల్పించింది. అత్యవసరమైన దేశాలకు బియ్యం ఎగుమతి కోసం ఈ సడలింపు ఇచ్చింది. ఈ ఆప్షన్ కింద అనుమతిస్తే పోర్టుల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వల ఎక్స్ పోర్టు సాగుతుంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పోర్టుల్లో పేరుకుపోయిన బియ్యం పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

Also Read..Rs 2000 Notes: 2వేల నోట్లు మీదగ్గర ఇంకా ఉన్నాయా? ఆర్‌బీఐ మరో కీలక ప్రకటన చేసింది

ప్రపంచం బియ్యం ఎగుమతుల్లో 45శాతం వాటా భారత్ దే. నెలకు 1.7 నుంచి 1.8 బిలియన్ టన్నుల బియ్యం ఎగుమతి చేసింది. భారత్ నిర్ణయంతో గత నెలలో అమెరికా సహా కొన్ని దేశాల్లో బియ్యం కోసం నానా ఇబ్బందులు పడ్డారు. ముందు జాగ్రత్తగా పెద్ద మొత్తంలో బియ్యం కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకున్నారు. దీంతో షాపుల్లో నో స్టాక్ బోర్డులు వేలాడాయి. బియ్యం ధరలు భారీగా పెరిగాయి.