Bank Strike : బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్
బ్యాంకులకు రేపటి(డిసెంబర్ 16,2021) నుంచి నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. బ్యాంకు సెలవులు సహా బ్యాంక్ యూనియన్ల సమ్మె కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలగొచ్చు.

Bank Holidays
Bank Holidays : బ్యాంకులకు రేపటి(డిసెంబర్ 16,2021) నుంచి నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. బ్యాంకు సెలవులు సహా బ్యాంక్ యూనియన్ల సమ్మె కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలగొచ్చు. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా బ్యాంక్ యూనియన్లు రెండు రోజుల (డిసెంబర్ 16,17) సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీని వల్ల బ్యాంకుల కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే బ్యాంకులు అన్ని ప్రాంతాల్లోనూ వరుసగా 4 రోజులు క్లోజ్‌లో ఉండవు. ప్రాంతాలను బట్టి ఇందులో మార్పులు ఉంటాయి.
Whatsapp: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. పంపడానికి ముందే చెక్ చేసుకునేలా
డిసెంబర్ 16 – బ్యాంక్ యూనియన్ల సమ్మె
డిసెంబర్ 17 – బ్యాంక్ యూనియన్ల సమ్మె
డిసెంబర్ 18 – యు సోసో థామ్ వర్ధంతి (షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు)
డిసెంబర్ 19 – ఆదివారం
మధ్యలో శనివారం మినహా.. బ్యాంకులకు మూడు రోజులు సెలవులు ఉంటాయి.
Cancer : క్యాన్సర్ దరిచేరకుండా కాపాడే ఆహారాలు ఇవే..
ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రాధాన్యత రంగాలకు ప్రాధాన్యం తగ్గిపోతుందని, దీని వల్ల స్వయం సహాయక గ్రూపులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని యూనియన్లు వాపోతున్నాయి. దీనికి నిరసనగా బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలుపుచ్చాయి. బ్యాంకులు మూతపడినా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు.