బీ అలర్ట్…శివసేనలోకి బీజేపీ ఎమ్మెల్యేలు!

  • Published By: venkaiahnaidu ,Published On : December 20, 2019 / 04:22 PM IST
బీ అలర్ట్…శివసేనలోకి బీజేపీ ఎమ్మెల్యేలు!

Updated On : December 20, 2019 / 4:22 PM IST

మహారాష్ట్రలో ప్రతిపక్ష బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు శివసేన రెడీ అవుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీకి చెందిన అనేకమంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి ఫ్రెండ్స్ అవబోతున్నారంటూ బీజేపీకి అలర్ట్ మెసేజ్ ఇచ్చింది. ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ పై కూడా సేన విమర్శలు గుప్పించింది. అనవసరంగా ఆయన అసెంబ్లీలో దూకుడు ప్రదర్శిస్తున్నారని శివసేన తెలిపింది. ప్రస్తుతం నాగ్ పూర్ లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాలపై ఉద్దవ్ ప్రభుత్వాన్ని ఫడ్నవీస్ కార్నర్ చేస్తున్నారు.

ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు,ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే యొక్క మనస్సు శుభ్రంగా ,నిజమైనదిగా ఉంది. అందువల్ల, అతను క్రొత్త స్నేహితులను పొందడం కొనసాగిస్తాడు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు చాలా మంది ప్రభుత్వానికి మిత్రులు కావొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సేన తన మౌత్ పీస్ ‘సామ్నా’లో ఎడిటోరియల్ పేర్కొంది.