పద్ధతి మార్చుకోకపోతే చేతులు, కాళ్లు విరుగుతాయి లేకపోతే శ్మశానానికి – దిలీప్ ఘోష్

  • Published By: madhu ,Published On : November 9, 2020 / 10:15 AM IST
పద్ధతి మార్చుకోకపోతే చేతులు, కాళ్లు విరుగుతాయి లేకపోతే శ్మశానానికి – దిలీప్ ఘోష్

Updated On : November 9, 2020 / 11:05 AM IST

Bengal BJP Chief’s “Broken Limbs, Death : టీఎంసీ కార్యకర్తలు పద్దతి మార్చుకోకపోతే..వారి చేతులు, కాళ్లు విరిగిపోయే ప్రమాదం ఉందని, చనిపోయే అవకాశం కూడా ఉందంటూ బీజేపీ చీఫ్ దిలీష్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హల్దియాలో నిర్వహించిన ర్యాలీలో ఘోష్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతున్నాయి. దీదీ సోదరులు ఇబ్బందులు సృష్టిస్తున్నారని, రాబోయే ఆరు నెలల్లో వారు పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు.



లేకపోతే వారి చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగిపోయే ఛాన్స్ ఉందని, తలలు పగిలిపోవచ్చు, ఆసుపత్రికి వెళ్లే పరిస్థితులు తలెత్తవచ్చన్నారు. అయినా..కూడా పద్ధతిని మార్చుకోకపోతే..ఏకంగా శ్మశానవాటికకు వెళ్లాల్సి ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.



కేంద్ర హోం మంత్రి ఇటీవలే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దిలీష్ ఘోష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బెంగాల్ లో తృణముల్ ప్రభుత్వానికి దగ్గరి రోజులు పడ్డాయని, బీహార్ లో లాలూ అధికారంలో ఉన్న సమయంలో జంగిల్ రాజ్యం ఉండేదని హింస అనేది రోజు వారీ వ్యవహారమన్నారు. అయితే..తమ పార్టీ గూండాలను తరిమికొట్టి బీజేపీ రాజ్యాన్ని ఏర్పాటు చేసిందన్నారు.



జంగిల్ రాజ్ ను ప్రజాస్వామ్యంగా మార్చామన్నారు. వెస్ట్ బెంగాల్ లో కూడా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నామని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు దీదీ పోలీసుల ఆధ్వర్యంలో కాకుండా..దాదా పోలీసుల నియంత్రణలో జరుగుతాయని వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ఘోష్ చేసిన వ్యాఖ్యలను టీఎంసీ నాయకులు ఖండించారు. రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నారని తెలిపారు.



https://10tv.in/74-years-old-man-kept-in-freezer-box-in-tamilnadu-rescued-alive-the-next-day/
వెస్ట్ బెంగాల్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో బెంగాల్ లో పాగా వేసేందుకు కాషాయ పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలోని 294 సీట్లలో 200 స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.