అప్పగింతల్లో పెళ్లికూతురు : నేను ఏడవను.. ఎందుకు ఏడవాలి

కోల్‌కతా: పెళ్లి అంటే.. పచ్చని పందిళ్లు, బంధువుల కోలాహలం, బాజా భజంత్రిలు, చివర్లో అప్పగింతలు. ఎవరి సంప్రదాయంలో వారు వివాహం చేసుకుంటారు. బోలెడు ఆచారాలు పాటిస్తారు. హిందూ సంప్రదాయంలో అయితే పెళ్లి కూతురు తల్లిదండ్రులు అల్లుడి కాళ్లు కడుగుతారు. కన్యదానం చేస్తారు. తరాలుగా వస్తున్న ఆచారం ఇది. అదే వెస్ట్ బెంగాల్‌లో అయితే అప్పగింతల సమయంలో నవవధువు ఏడవాలి. ఇది వారి సంప్రదాయం. తల్లిదండ్రులను వదిలి వెళ్లే సమయంలో పెళ్లి కూతురు ఏడుస్తుంది.
కానీ ఓ నవవదువు సంప్రదాయాన్ని ఛాలెంజ్ చేసింది. ట్రెడిషిన్‌ను బ్రేక్ చేసింది. కొత్త ట్రెండ్ సెట్ చేసింది. అప్పగింతల సమయంలో ఎందుకు ఏడవాలి.. నేను ఏడవను.. అని రివర్స్ అయ్యింది. హ్యాపీగా నవ్వులు చిందిస్తూ అత్తారింటికి వెళ్లిపోయింది. అంతేకాదు ఆడపెళ్లి వాళ్లే మర్యాదలు చేయాలా.. పెళ్లి కొడుకు వాళ్లకు ఏమైనా కొమ్ములు వచ్చాయా.. అని నిలదీసింది. పంతులు ఒకటి చెబితే.. పెళ్లి కూతురు మరొకటి చేసింది. ఇప్పటివరకు ఉన్న సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించి శెభాష్ అనిపించుకుంది ఈ కొత్త పెళ్లికూతురు.
పశ్చి బెంగాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగాల్‌కు చెందిన ఓ పెళ్లి కూతరు సంప్రదాయాలను బ్రేక్ చేసింది. ఆచారాలను సవాల్ చేసి ట్రెండ్‌ను సెట్ చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 72గంటల వ్యవధిలో 30లక్షల వ్యూస్ వచ్చాయి. 70వేల మంది షేర్లు చేశారు. ఈ అమ్మాయి తీరుని ప్రశంసలతో ముంచెత్తారు. ట్రెడిషన్స్‌ను ఛాలెంజ్ చేసి అందరికి ఆదర్శంగా నిలిచావని కొనియాడుతున్నారు. మేము కూడా నీ బాటలోనే నడుస్తామని కొందరు అమ్మాయిలు అంటున్నారు.