కోవిడ్ కేర్ సెంటర్ గా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం

  • Published By: murthy ,Published On : July 9, 2020 / 02:31 PM IST
కోవిడ్ కేర్ సెంటర్ గా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం

Updated On : July 9, 2020 / 3:07 PM IST

రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో రోగులకు అవసరమైన సేవలందించేందుకు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

స్టేడియంతో పాటు బెంగుళూరు ప్యాలెస్ ను కూడా కోవిడ్-19 సెంటర్ గా మారుస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాబోయే రోజులలో కేసుల సంఖ్య మరింత పెరగనున్న దృష్ట్యా ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది.

బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌-19 సంరక్షణ కేంద్రంగా మార్చింది. బెంగళూరు ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని కరోనా కేంద్రం ఇన్‌చార్జి ఆర్ అశోక్ చెప్పారు.

బాధితులను సంరక్షించడానికి 600 అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సమచారాం మేరకు.. కర్ణాటకలో ప్రస్తుతం 28,877 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.  వీటిలో 16,531 యాక్టివ్ కేసులుండగా, 11,876 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 470 మంది వైరస్ బారిన పడి మరణించారు.