Cockroach in Jamun : గులాబ్‌ జామూన్‌లో బొద్దింక..కష్టమర్ కు రూ.55 వేల పరిహారం ఇవ్వాలని తీర్పు

హోటల్ వెళ్లిన కష్టమర్ గులాబ్ జామూన్స్ ఆర్డర్ ఇవ్వగా తెచ్చిన ఇచ్చిన జామూన్ల బౌల్ లో ఓ బొద్దింక ఉంది. దీంతో సదరు వ్యక్తి రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు పెట్టి భారీ పరిహారం పొందాడు.

Cockroach in Jamun : గులాబ్‌ జామూన్‌లో బొద్దింక..కష్టమర్ కు రూ.55 వేల పరిహారం ఇవ్వాలని తీర్పు

To Pay Rs 55000 Fine Cockroach Customer Jamun

Updated On : October 8, 2021 / 3:06 PM IST

To Pay Rs 55000 Fine Cockroach Customer Jamun : హొటల్స్ లు వెల్లితే టీలో ఈగలు, భోజనంలో బొద్దింకలు..సాంబార్ లో బల్లులు పడిన ఘటనలు కోకొల్లలు. కానీ ఏం చేస్తాం మహా అయితే..సదరు హోటల్ వారికి చెబుతాం. దానికి వాళ్లు సారి చెబితే మనం కూడా పెద్దగా పట్టించుకోకుంబా బయటకొచ్చేస్తాం. కానీ ఓ వ్యక్తి అలా మనకెందుకులే అని ఊరుకోలేదు. ఓ రెస్టారెంట్ కు వెళ్లిన ఓ వ్యక్తి గులాబ్ జామున్స్ ఆర్డర్ చేశారు. సర్వర్ తెచ్చి ఇచ్చారు. కానీ ఆ గులాబ్ జామూన్ లో ఓ బొద్దింక ఉంది..ఆ విషయం రెస్టారెంట్ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో కోర్టులో కేసు వేసి చక్కగా పరిహారం కూడా పొందాడు. దీంతో సదరు రెస్టారెంట్ కు దిమ్మతిరిగిపోయింది. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నాంరా బాబూ అని అనుకోవాల్సివ వచ్చింది.

Read more : ఇదే అతడి హెల్త్ సీక్రెట్: ఏడాదిగా బొద్దింకలే ఆహారం

బెంగళూరులో రాజణ్ణ అనే వ్యక్తి గాంధీనగరలోని కామత్‌హోటల్‌ కు వెళ్లాడు. గులాబ్ జామూన్‌ ఆర్డర్ ఇచ్చాడు. సర్వర్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. తిందామని చూస్తే దాంట్లో ఓ బొద్దింక పడి ఉంది. అది చూసిన రాజణ్ణ దాన్ని తన మొబైల్‌లో వీడియో తీస్తుండగా రెస్టారెంట్‌ సిబ్బంది గమనించి గబగబా వచ్చి అతని చేతిలోంచి మొబైల్‌ను లాక్కోవడానికి యత్నించారు.

దీనిపై ఆ రెస్టారెంట్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. కానీ వాళ్లు దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం సమాధానం కూడా చెప్పలేదు. అలా రెండేళ్లు దాటిపోయింది. దీంతో రాజణ్ణ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే వినియోగదారుల ఫోరంలో కూడా కేసు వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ఫోరం బాధితుడు రాజణ్ణకు రూ.55 వేల పరిహారం చెల్లించాలని రెస్టారెంట్‌ను ఆదేశించింది.

Read more : అయ్య బాబోయ్..ఉల్లి పకోడీలో కప్ప..!!