Bengaluru rape case : సెల్ఫీ తీసుకుని మరీ మ‌హిళ‌ను రేప్ చేసిన క్యాబ్ డ్రైవ‌ర్‌..

ఓ క్యాబ్ డైవర్ మాత్రం తన కారు ఎక్కిన మహిళతో సెల్ఫీ దిగాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారం చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

Bengaluru rape case : సెల్ఫీ తీసుకుని మరీ మ‌హిళ‌ను రేప్ చేసిన క్యాబ్ డ్రైవ‌ర్‌..

Cab Driver Rape

Updated On : September 23, 2021 / 6:16 PM IST

Bengaluru rape case : మహిళలపై క్యాబ్ డైవర్ల అఘాయిత్యాలు, అత్యాచారాల ఘటన గురించి ఎన్నో విన్నాం. అత్యాచారం చేశాక తప్పించుకోవటానికి ఎన్నో యత్నాలుచేస్తారు. కానీ ఓ క్యాబ్ డైవర్ మాత్రం తన కారు ఎక్కిన మహిళను రేప్ చేసే ముందు ఆమెతో సెల్ఫీ దిగాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో సదరు బాధితురాలు ఆ ఫోన్ పట్టుకుని మరీ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగుళూరులో జరిగింది. బెంగళూరులో గురువారం (సెప్టెంబర్ 23,20210 ఉద‌యం జీవ‌న్ బీమా న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘటన జరిగింది.

Read more : Gang Rape : బాలికపై 29మంది గ్యాంగ్ రేప్

ఏపీకి చెందిన మ‌హిళ త‌న ఫ్రెండ్ ఇంటి నుంచి త‌న ఇంటికి వెళ్లటానికి గురువారం తెల్ల‌వారుజామున 3.20 నిమిషాల‌కు ఓ క్యాబ్ బుక్ చేసుకుంది. దార్లో నిద్ర వచ్చి హాయిగా నిద్రపోయింది. క్యాబ్ డ్రైవర్ ఆమె చెప్పిన ఎడ్రస్ కు కరెక్టుగా తీసుకొచ్చాడు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి ఆమె ఆ క్యాబ్‌లో త‌న ఇంటికి 3.40 నిమిషాల‌కు ఆమె ఇంటికి వచ్చాక కారు ఆపాడు. అక్కడిదాకా బాగానే ఉంది.కానీ మాడమ్ మీరు చెప్పిన అడ్రస్ వచ్చేసింది అంటూ కారు డోర్ తీసుకుని కిందకు దిగాడు. తరువాత బ్యాక్ డోర్ తీసి చూడగా ఆమె మంచి నిద్రలో ఉంది. డ్రైవర్ పిలిచినా పలకలేనంత మత్తుగా నిద్రలో ఉంది. అలా ఆమెను చూసిన ఆ డ్రైవర్ కు బుద్ధి చలించింది.

Read more : Woman Murder : మద్యం మత్తులో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య

నెమ్మదిగా మళ్లీ క్యాబ్ స్టార్ట్ చేశాడు. నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి కారు ఆపాడు. తరువాత ఆమెతో సెల్ఫీ దిగాడు. ఆ త‌ర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తున్న సమయంలో ఆమెకు నిద్ర మత్తు విడింది. పెనుగులాడింది.కానీ అతని పశుబలం నుంచి తప్పించుకోలేకపోయింది.

Read more : Girl Raped : బస్సులో బాలికపై అత్యాచారం.. యూపీలో దారుణం

తరువాత తన బలాన్ని అంతా ఉపయోగించి క్యాబ్ డ్రైవ‌ర్‌ను తోసి వేసింది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. కానీ అంతటి షాకింగ్ ఘటన నుంచి కూడా ఆమె వెంటనే తేరుకుని అక్కడ నుంచి ప‌రుగులు తీసింది. వెళుతు వెళ్లుతు..సదరు క్యాబ్ డ్రైవ‌ర్ ఫోన్‌ను కూడా ప‌ట్టుకువెళ్లింది. ఆ ఫోన్‌ను ఆమె పోలీసుల‌కు అప్ప‌గించి..తనకు జరిగిన ఘటన గురించి చెప్పింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షలకు పంపించగా లైంగిక దాడి జ‌రిగిన‌ట్లు తేలింది. దీంతో సదరు క్యాబ్ డ్రైవర్ కోసం పోలీసుల‌ు గాలిస్తున్నారు.