Covaxin Vaccine Price: భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా ధరలు ఇవే..

భారత వ్యాక్సిన్ తయారీదారు భారత బయోటెక్ తన కోవాగ్జిన్ టీకా ధరలను ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోవాగ్జిన్ ధరలను వెల్లడించింది. కేంద్రానికి ఒక్కో డోసు రూ.600కు ఇవ్వనుంది.

Covaxin Vaccine Price: భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా ధరలు ఇవే..

Covaxin Vaccine Price (2)

Updated On : April 24, 2021 / 10:31 PM IST

Bharat Biotech Covaxin Vaccine Prices : భారత వ్యాక్సిన్ తయారీదారు భారత బయోటెక్ తన కోవాగ్జిన్ టీకా ధరలను ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోవాగ్జిన్ ధరలను వెల్లడించింది. కేంద్రానికి ఒక్కో డోసు రూ.600కు ఇవ్వనుంది.

ప్రైవేటు ఆస్పత్రులకు కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.1,200కు ఇవ్వనుంది. విదేశాలకు ఎగుమతి చేసే వ్యాక్సిన్ డోసుల ధరలను కూడా వెల్లడించింది. ఒక్కో డోసు 15 నుంచి 20 డాలర్లకు భారత్ బయోటెక్ ఎగుమతి చేయనుంది.

తన ఉత్పత్తిలో 50శాతం కేంద్రానికి వ్యాక్సిన్లను కేటాయిస్తామని వెల్లడించింది. మే 1 నుంచి భారతదేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికి వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

బహిరంగ మార్కెట్లోకి భారత బయోటెక్ కోవాగ్జిన్ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ల డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచే దిశగా భారత బయోటెక్ ఏర్పాటు చేస్తోంది.