డిసెంబర్‌ 10న కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి భూమిపూజ

  • Published By: bheemraj ,Published On : December 5, 2020 / 02:16 PM IST
డిసెంబర్‌ 10న కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి భూమిపూజ

Updated On : December 5, 2020 / 3:11 PM IST

new Parliament building bhumipuja : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరగనుంది. ఈనెల 10న కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ భూమిపూజలో పాల్గొంటారు.



ప్రస్తుత పార్లమెంట్‌ పక్కనే కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. 2022 చివరికల్లా నూతన పార్లమెంట్‌ నిర్మాణం పూర్తికానుంది. కొత్త పార్లమెంట్‌ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ నిర్మిస్తోంది.