Milind Deora : లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు బిగ్ షాక్
పార్టీతో తన కుటుంబానికి ఉన్న 55ఏళ్ల అనుబంధం వీడిందని ట్వీట్ చేశారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత మురళీదేవరా కుమారుడు మిలింద్.. 2004, 2009లో ముంబై సౌత్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు.

Milind Deora Quits Congress
Milind Deora : సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఓవైపు దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ యాత్ర చేపడుతున్న సమయంలో కీలక నేత పార్టీని వీడటం కలకలం రేపింది. సీనియర్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, 2019 ఎన్నికల తర్వాత పార్టీకి చెందిన సీనియర్లు అంతా రాజీనామాలు చేస్తూ వస్తున్నారు. దాదాపు 12మంది నేతలు ఈ లిస్టులో ఉండటం చర్చనీయాంశంగా మారింది.
Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..! సంక్రాంతి తర్వాత విడుదల..!
కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీతో తన కుటుంబానికి ఉన్న 55ఏళ్ల అనుబంధం వీడిందని ట్వీట్ చేశారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత మురళీదేవరా కుమారుడు మిలింద్.. 2004, 2009లో ముంబై సౌత్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత రెండుసార్లు శివసేన అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో మిలింద్ చేరతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారు.