Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. రెండు విడతల్లో పోలింగ్.. తేదీలు ఇవే.. ఫలితాలు ఎప్పుడంటే..
Bihar Assembly Elections 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

Bihar Assembly Elections 2025
Bihar Assembly Elections 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నిలక ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను వెల్లడించారు. జూబ్లీహిల్స్ లో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు.
బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఓటర్ల జాబితా అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించాం. ఓటర్ లిస్టును ప్రక్షాళన చేశాం. ఆగస్టు 1న పూర్తి జాబితా ప్రకటించాం. నామినేషన్లకు పదిరోజుల ముందు కూడా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చునని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. రాష్ట్రంలో 14.01 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం బీహార్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు. వీరిలో పురుష ఓటర్లు 3.92కోట్లు కాగా.. మహిళా ఓటర్లు 3.50 కోట్ల మంది ఉన్నారు. వీరిలో వందేళ్లు పైబడిన ఓటర్లు 14వేల మందికి వరకు ఉన్నారని పేర్కొన్నారు. దివ్యాంగులు, 85ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఉంది.
ఎన్నికలకు సంబంధించి మొత్తం 90,172 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. గరిష్టంగా 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ కేటాయించాం. వందశాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ తో పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫొటోలు వినియోగిస్తున్నామని ఈసీ ప్రకటించారు.
రెండు విడడతల్లో బీహార్‌లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నిలక ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. తొలి విడత నవంబర్ 6వ తేదీన.. రెండో విడత నవంబర్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఫలితాలను నవంబర్ 14వ తేదీన విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.

Bihar Assembly Elections 2025 schedule