Bihar Reopens Colleges : బీహార్ లో తెరుచుకున్న విద్యాసంస్థలు

బీహార్ లో కొవిడ్ కారణంగా నెలలుగా మూతబడిన విద్యాసంస్థలు క‌రోనా కేసులు త‌గ్గ‌డంతో సోమవారం రీ ఓపెన్ అయ్యాయి.

Bihar Reopens Colleges : బీహార్ లో తెరుచుకున్న విద్యాసంస్థలు

Bihar

Updated On : July 12, 2021 / 6:10 PM IST

Bihar Reopens Colleges బీహార్ లో కొవిడ్ కారణంగా కొద్ది నెలలుగా మూతబడిన విద్యాసంస్థలు క‌రోనా కేసులు త‌గ్గ‌డంతో సోమవారం రీ ఓపెన్ అయ్యాయి. సోమవారం నుంచి ఆ రాష్ట్రంలో 50 శాతం సామర్థ్యంతో 11, 12వ త‌ర‌గ‌తుల‌కు కాలేజీలు ప్రారంభం అయ్యాయి. చాన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ కాలేజీకి రావ‌డంతో విద్యార్థులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మిత్రుల‌ను క‌లుసుకుని ఆనందంలో తేలిపోయారు.

జూలై 12 నుండి పూర్తి COVID భద్రతా ప్రోటోకాల్‌ మధ్య ప్రత్యామ్నాయ రోజులలో 50 శాతం హాజరుతో కాలేజీలు,యూనివర్శిటీలు ప్రారంభమైనట్లు బీహార్ ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. క‌రోనా థార్డ్ వేవ్ వ‌స్తుంద‌న్న జాగ్ర‌త్త‌లో తాము ఉన్న‌ట్లు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ చెప్పారు. కేంద్రం కూడా చాలా జాగ్ర‌త్తగా అన్నింటినీ ప‌రిశీలిస్తోంద‌న్నారు. ఆక్సిజ‌న్‌తో పాటు అన్నీ అందుబాటులో ఉంచామ‌న్నారు. హాస్పిట‌ళ్లు, అధికారులు సంసిద్ధంగా ఉన్నార‌న్నారు. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉన్నార‌ని, ప‌రిస్థితిని నిరంత‌రం మానిట‌ర్ చేస్తున్న సీఎం నితీశ్ తెలిపారు.