‘My Second Wife’ Restaurant : ఆ రెస్టారెంట్‌లో రెండో పెళ్లి చేసుకున్నవారికి ప్రత్యేక ఆఫర్

ఆ రెస్టారెంట్ పేరు ‘మై సెకండ్ వైఫ్’..ఈ రెస్టారెంట్ లో రెండో పెళ్లి చేసుకున్నవారికి ప్రత్యేక ఆఫర్ ప్రకటించాడు ఓనర్.

‘My Second Wife’ Restaurant : ఆ రెస్టారెంట్‌లో రెండో పెళ్లి చేసుకున్నవారికి ప్రత్యేక ఆఫర్

'My Second Wife' restaurant IN Bihar

Updated On : December 26, 2022 / 5:06 PM IST

‘My Second Wife’ restaurant : హోటల్స్, రెస్టారెంట్స్ లకు వింత వింత పేర్లు పెట్టి కష్టమర్లను ఆకట్టుకుంటుంటారు నిర్వాహకులు. ‘లాలింపు, ‘అరిటాకు’. అమ్మముద్ద,ఉప్పూకారం, తినేసి పో,నా పొట్టనాఇష్టం, ‘రా బావా తినిపో’..వంటి పలు వింత వింత పేర్లు విన్నాం. అలాగే కాస్త క్లాస్ గా ఉండే ‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలా’,ఎంబీయే చాయ్ వాలా వంటి పేర్లు విన్నాం. కానీ బీహార్ కు చెందిన ఓ వ్యక్తి తన రెస్టారెంట్ కు పెట్టిన పేరు విన్నా..అతని రెస్టారెంట్ ఇచ్చే ప్రత్యేక ఆఫర్ గురించి విన్నా భలే తమాషాగా అనిపిస్తుంది…

ఆ రెస్టారెంట్ పేరు ‘మై సెకండ్ వైఫ్’..!! ఏంటీ భలే తమాషాగా ఉందికదూ పేరు వింటే. రంజిత్ కుమార్ అనే వ్యక్తి బీహార్ రాజధాని పాట్నాకు 70కిలోమీటర్ల దూరంలో ఉండే బార్హ్ థానా సిటీ రోడ్ లో ఉన్న సవేరా సినిమా థియేట్ సమీపంలో ఓరెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. రోడ్డుపై వెళేవాంతా ఈ పేరు విని ఆశ్చర్యపడుతుంటారు. అంతేకాదు ఇదేదో భలే తమాషా ఉంది టేస్ట్ చూస్తే పోలా అనుకుంటు అక్కడ ఆగి మరీ వెళుతున్నారు. దీంతో ‘ మై సెకండ్ వైఫ్’ హోటల్ కు మాంచి గిరాకీ ఉంటుంది. ప్రస్తుతం హోటల్‌లో టీ, బర్గర్లు, నూడుల్స్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి. పైగా ఈ వింత రెస్టారెంట్ పెట్టటమే కాదు ఓనర్ రంజిత్ మంచి ఆఫర్ కూడా ఇచ్చాడు.

రెండో వివాహం చేసుకున్నవారికి మా హోటల్ లో ప్రత్యేక ఆఫర్ కూడా ఉంటుందని చెబుతున్నాడు. గత అక్టోబర్ లోనే ఈ హోటల్ ప్రారంభించానని ఈ పోటీ ప్రపంచంలో కష్టమర్లను ఆకట్టుకోవటానికి ఏదోక వినూత్నంగా పేరు ఉండాలని ఈ పేరు పెట్టానని చెబుతున్నాడు. ఈ వింత పేరు పెట్టటం వల్లకుటుంబ సభ్యులు అభ్యంతరం పెట్టారని కానీ నేను వినకుండా అదే పేరు పెట్టినందుకు కష్టమర్లు బాగా వస్తున్నారని చెప్పుకొచ్చాడు. పైగా తాను ఇంట్లో కంటే ఈ హోటల్ పనిలోనే ఎక్కువగా ఉంటుంటానని వ్యాపారం పెంచుకోవాలని తప్పదని అందుకే నాకు ఈ హోటల్ రెండో భార్యవంటిదని అందుకనో కొంత ఇటువంటి వింత పేరు పెట్టానని చెప్పుకొచ్చాడు రంజిత్.

అందుకే రెండో వివాహం చేసుకున్నవారికి మా హోటల్ లో రాయితీ ఇస్తున్నానని తెలిపాడు. సాధారణంగా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నానని, అందుకే ఈ హోటల్‌ తన రెండో భార్య వంటిదని రంజిత్‌ చెప్పాడు. హోటల్‌కు ఇలాంటి పేరు పెట్టడంపై తన కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారని వెల్లడించాడు.