Bihar: మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మంత్రి.. వేగంగా వచ్చి ఢీకొట్టిన టెంపో
బీహార్ ఎక్సైజ్ శాఖ మంత్రి రత్నేశ్ సదా గాయపడ్డారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో టెంపో వాహనం వేగంగా వచ్చి ఆయనతోపాటు ఆయన భద్రత సిబ్బందిని ఢీకొట్టింది.

Bihar minister Ratnesh Sada
Bihar minister Ratnesh Sada: బీహార్ రాష్ట్రంలో ఓ మంత్రికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. మంత్రి మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో టెంపో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రితోసహా మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్వల్పగాయాలు మాత్రమే కావడంతో వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మధ్యాహ్నం సమయానికి మంత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: Telangana: న్యూఇయర్ వేళ తెలంగాణలో రెచ్చిపోయిన మందుబాబులు.. ఎన్నికోట్ల మద్యం తాగారో తెలుసా?
బీహార్ ఎక్సైజ్ శాఖ మంత్రి రత్నేశ్ నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా తన స్వగ్రామానికి వెళ్లారు. రాత్రి న్యూఇయర్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. తెల్లవారుజామున తన సోదరుడు, ఓ భద్రతా సిబ్బందితో కలిసి మార్నింగ్ వాక్ కు వెళ్లాడు. ఆ సమయంలో వేగంగా వచ్చిన టెంపో వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. మంత్రికి అధిక రక్తపోటు, మధుమేహం కూడా ఉండటంతో పరీక్షలు నిర్వహించారు. దీనికితోడు సిటీ స్కాన్, ఎక్స్ -రే కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన రిపోర్టులు నార్మల్ గా రావడంతో మధ్యాహ్నం సమయంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
Also Read: మార్చిలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం.. పెళ్లికూతురు ఎవరో తెలుసా.. మోదీ మనన్నలుసైతం అందుకుంది..!
మంత్రి సోదరుడు, భద్రతా సిబ్బందికి రెండు చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. అయితే, స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు టెంపో అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. టెంపో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా.. లేదా ప్రమాదం వెనుక మరేదైనా కారణం ఉందా అనేకోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.