Telangana: న్యూఇయర్ వేళ తెలంగాణలో రెచ్చిపోయిన మందుబాబులు.. ఎన్నికోట్ల మద్యం తాగారో తెలుసా?

న్యూఇయర్ వేళ తెలంగాణలో మద్యం ఏరులై పారింది. న్యూఇయర్ సెలెబ్రేషన్స్ పేరుతో మందుబాబులు మద్యం మత్తులో మునిగి తేలాశారు.

Telangana: న్యూఇయర్ వేళ తెలంగాణలో రెచ్చిపోయిన మందుబాబులు.. ఎన్నికోట్ల మద్యం తాగారో తెలుసా?

Liquor

Updated On : January 1, 2025 / 2:02 PM IST

Record liquor sales in Telangana: న్యూఇయర్ వేళ తెలంగాణలో మద్యం ఏరులై పారింది. న్యూఇయర్ సెలెబ్రేషన్స్ పేరుతో మందుబాబులు మద్యం మత్తులో మునిగి తేలారు. ఫలితంగా మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో రూ.520 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 30న రూ.402 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. వారం రోజుల్లో సుమారు రూ.1800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

Also Read: మార్చిలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం.. పెళ్లికూతురు ఎవరో తెలుసా.. మోదీ మనన్నలుసైతం అందుకుంది..!

కొత్త సంవత్సరం వేళ తెలంగాణ వ్యాప్తంగా జోరుగా మద్యం విక్రయాలు జరిగాయి. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ అదేసమయంలో 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దెత్తున సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సెలెబ్రేషన్స్ లో మందుబాబులు మద్యం మత్తులో మునిగితేలారు. డిసెంబర్ నెల మొత్తం సుమారు రూ. 3,800కోట్ల పైచిలుకు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. మరీముఖ్యంగా 30, 31 తేదీల్లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం. రెండు రోజుల్లో వెయ్యి కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 30వ తేదీన రూ.402 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. 31వ తేదీన (మంగళవారం) రాత్రి 10గంటల వరకు అందిన లెక్కల ప్రకారం సుమారు రూ. 520 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. రాత్రి 12గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: LPG cylinder Price : కొత్త సంవ‌త్స‌రం తొలి రోజునే గ్యాస్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌..

డిసెంబర్ 25 నుంచి 31 వరకు దాదాపు రూ. 1800 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ నెలలో మొత్తంలో 38లక్షల కేసుల లిక్కర్ సేల్స్ అయితే, 45లక్షల బీర్ కేసుల సేల్స్ అయినట్లు ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సాధారణంగా ప్రతీరోజూ రూ.150 నుంచి రూ. 200 కోట్లు లిక్కర్ సేల్స్ ఉంటాయి. అయితే, డిసెంబర్ నెలలో మాత్రం అది పూర్తిస్థాయిలో దాటిపోయిన పరిస్థితి. మొత్తానికి న్యూఇయర్ వేడుకల వేళ మందుబాబులు ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండించారు.