బీహార్ మొదటి దశ పోలింగ్

  • Published By: madhu ,Published On : October 28, 2020 / 05:58 AM IST
బీహార్ మొదటి దశ పోలింగ్

Updated On : October 28, 2020 / 6:48 AM IST

Bihar polls: In first phase : బీహార్ రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 71 అసెంబ్లీ స్థానాలకు 2020, అక్టోబర్ 28వ తేదీ బుధవారం పోలింగ్ జరుగనుంది. 1066 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.



ఒక్కో పోలింగ్‌ బూత్‌కు గరిష్టంగా ఉన్న ఓటర్ల సంఖ్యను 1,600 నుంచి 1,000కి తగ్గించింది. 80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించింది. కరోనా నేపథ్యంలో పకడ్బంది ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. ఈవీఎంలను తరచుగా శానిటైజ్‌ చేయనున్నారు.



ఓటర్లు, సిబ్బంది మాస్క్ లు కంపల్సరీగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల్లో 952 మంది పురుషులు, 114 మంది మహిళలు ఉన్నారు. వీరిలో జేడీయూ తరఫున 35 మంది, బీజేపీ తరఫున 29 మంది భవితవ్యాన్ని తేల్చనున్నారు.



ఆర్జేడీ తరఫున 42 మంది, కాంగ్రెస్‌ తరఫున 20 మంది బరిలో దిగనున్నారు. ఎల్జేపీ 41 చోట్ల పోటీ చేస్తుండగా, జేడీయూ పోటీ చేస్తున్న 35 చోట్లా అభ్యర్థులను నిలిపింది. కేబినెట్‌ మంత్రుల్లో 6 మంది ఈ దశలో బరిలో నిలిచారు. రెండో దశ పోలింగ్‌ నవంబర్‌ 3న, మూడో దశ పోలింగ్‌ నవంబర్‌ 7న, ఫలితాలు నవంబర్‌ 10న వెలువడనున్నాయి.