మత సామరస్యం: మసీదులో అంతా హిందువులే

భారతదేశం విభిన్న మతాల కలయిక. భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలోభిన్నత్వం అనేది భారత్ కుమాత్రం సొంతం. హిందూ ముస్లిం భాయీ..భాయీ నినాదంలో భారత్ లో అణువణువు వినిపిస్తుంది. ఇటువంటి అరుదైన అద్భుతమైన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ ఒకరి మతాల పద్ధతులు..మరొకరికి పూర్తిగా తెలియవు. కానీ మనస్సులు మాత్రం కలిసే ఉంటాయి. అదే మతసామరస్యం అంటే. దీనికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది బీహార్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ఉన్న మసీద్. ఆ గ్రామం పేరు యారి.
యారి గ్రామంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మసీద్ ఉంది. ఈ మసీద్ బాధ్యతల్ని హిందువులే నిర్వహించటం విశేషం. నలంద పట్టణ సమీపంలో ఉన్న మారి గ్రామంలోని మసీద్ లో మతసామరస్యం వెల్లివిరుస్తోంది. మారి గ్రామంలో ప్రస్తుతం ముస్లిములెవరూ నివశించడం లేదు. దీంతో మసీద్ అలా ఉండిపోవటం ఇష్టంలేని హిందువులు ఈ మసీదు నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రతీరోజూ మసీదును శుభ్రం చేయటమే కాక..పెన్ డ్రైవ్ సాయంతో ఐదు పూటలా ఆజాన్ ను ఇస్తారు. అంతేకాదు ఆ గ్రామంలో హిందువులు ఎవరైనా వివాహం చేసుకుంటే ముందుగా ఈ మసీద్ కు వచ్చి అల్లా ఆశీస్సులు పొందడం మారి గ్రామస్థులకు నియమంగా మారింది. హిందువులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి
మసీదు ఆలన పాలన నిర్వహిస్తున్నారు.