ఇలాగైతే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400కు పైగా సీట్లు గెలుస్తుంది: కాంగ్రెస్ నేత పిట్రోడా

లోక్‌సభ ఎన్నికలు దేశ తలరాతను నిర్ణయించేవని ఆయన అన్నారు. అలాగే, తాను ఇటీవల అయోధ్య రామ మందిరంపై చేసిన వ్యాఖ్యలను

ఇలాగైతే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400కు పైగా సీట్లు గెలుస్తుంది: కాంగ్రెస్ నేత పిట్రోడా

Modi- Sam Pitroda

Updated On : December 28, 2023 / 3:57 PM IST

Lok Sabha Elections 2024: దేశంలో మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ శ్యామ్‌ పిట్రోడా మరోసారి ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి శ్యామ్‌ పిట్రోడా సన్నిహితుడు.

తాజాగా శ్యామ్‌ పిట్రోడా మాట్లాడుతూ… లోక్‌సభ ఎన్నికల కంటే ముందే ఈవీఎంలను సరిచేయాలని, లేదంటే బీజేపీ ఈ ఎన్నికల్లో 400కు పైగా సీట్లలో విజయం సాధిస్తుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు దేశ తలరాతను నిర్ణయించేవని ఆయన అన్నారు. అలాగే, తాను ఇటీవల అయోధ్య రామ మందిరంపై చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని చెప్పారు.

మతం వ్యక్తిగత విషయమని, దాన్ని రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దని శ్యామ్‌ పిట్రోడా అన్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు చేయనున్న భారత్ న్యాయ్ యాత్రపై శ్యామ్‌ పిట్రోడా స్పందిస్తూ.. కొన్ని నెలల్లో జరగనున్న ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించినవని చెప్పారు.

దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నామో ఆలోచించుకోవాలన్నారు. ఒకే మతం ఆధిపత్యం చెలాయించే దేశం కావాలా? అని శ్యామ్‌ పిట్రోడా ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్ సహా దేశంలోని విపక్షాలన్నీ ఇప్పటికే ఎన్నో సార్లు ఈవీఎంలపై అనేక ఆరోపణలు చేశాయి. ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండిస్తూ వస్తోంది.

Also Read: కాకినాడలో 3 రోజులపాటు పవన్ కళ్యాణ్ సమావేశాలు