Lakhimpur Kheri Violence : కేంద్రమంత్రి అజయ్ మిశ్రాకు ఢిల్లీ పెద్దల పిలుపు.. మంత్రిపదవి ఊడినట్లేనా?

లఖీంపూర్‌ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్‌ స్పష్టీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా రాజీనామాపై విపక్షాల డిమాండ్లు వెల్లువెత్తాయి.

Lakhimpur Kheri Violence : కేంద్రమంత్రి అజయ్ మిశ్రాకు ఢిల్లీ పెద్దల పిలుపు.. మంత్రిపదవి ఊడినట్లేనా?

Lakhimpur Kheri Violence

Updated On : December 16, 2021 / 9:17 AM IST

Lakhimpur Kheri Violence : లఖీంపూర్‌ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్‌ స్పష్టీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా రాజీనామాపై విపక్షాల డిమాండ్లు వెల్లువెత్తాయి. రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన 12 మంది ఎంపీలతోపాటు ప్రతిపక్ష పార్టీల నేతలు మంత్రి రాజీనామా చేయాలనీ పట్టుబడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను డిల్లీకి పిలిచారు ఆ పార్టీ పెద్దలు. తక్షణమే ఢిల్లీకి రావాలని అజయ్ మిశ్రాకు కేంద్ర పెద్దలు తెలిపారు.

చదవండి : Lakhimpur Violence : జర్నలిస్ట్‌పై బూతులతో విరుచుకుపడ్డ కేంద్రమంత్రి

సిట్ నివేదిక తర్వాత కేంద్ర పెద్దలు తొలిసారి మిశ్రాతో సమావేశం అవుతున్నారు. లఖింపూర్ ఖేరి ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో కేంద్ర పెద్దలు మిశ్రాను మంత్రిపదవి నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇదే అంశంపై మిశ్రాతో మాట్లాడనున్నారు కేంద్రపెద్దలు. ఈ రోజు సాయంత్రంవ్ అరకు మిశ్రా మంత్రిపదవిపై స్పష్టత రానుంది.

చదవండి : Lakhimpur Kheri : రైతులపై కావాలనే కారు ఎక్కించారు… పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ దాడి జరిగిందన్న సిట్

కాగా ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన లఖీంపూర్‌ ఖేరి జిల్లాలో హోంశాఖ సహాయమంత్రి ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య కావాల్సి ఉంది. అతడిని తీసుకొచ్చే క్రమంలో రోడ్డుపై ఆందోళన చేస్తున్న రైతులపై నుంచి కారు పోనిచ్చారు. ఈ ఘటనలో మొత్తం 4గురు ప్రాణాలు కోల్పోగా.. అనంతరం జరిగిన అల్లర్లలో మరికొందరు మృతి చెందారు. మృతుల్లో ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు.

చదవండి : Lakhimpur Kheri : వందల మంది రైతులుండగా సాక్ష్యులు 23మందేనా

దీనిపై సిట్ విచారణ చేపట్టింది. దర్యాప్తు పూర్తి చేసి తాజాగా తమ నివేదికను సమర్పించింది. ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగినదిగా తమ విచారణలో తేల్చింది సిట్. దీంతో అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్యకేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే అజయ్ మిశ్రాని మంత్రి పదవి నుంచి తొలగించాలని పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు. ఇక ఈ సమయంలోనే మంత్రిని కేంద్ర పెద్దలు పిలవడం ఆసక్తి రేకెత్తిస్తుంది.