Karnataka Politics: కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా.. బిల్లులు చింపేసి డిప్యూటీ స్పీకర్ మిద విసిరేసిన బీజేపీ ఎమ్మెల్యేలు, 10 మంది సస్పెండ్

అంతకు ముందు సభలో తీవ్ర ఆందోళన కొనసాగింది. ఈ గందరగోళం మధ్యే ప్రభుత్వం ఐదు బిల్లును ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి

Karnataka Politics: కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా.. బిల్లులు చింపేసి డిప్యూటీ స్పీకర్ మిద విసిరేసిన బీజేపీ ఎమ్మెల్యేలు, 10 మంది సస్పెండ్

Karnataka Assembly: బెంగుళూరులో జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి ఐఏఎస్ అధికారులతో స్వాగతం పలకడంపై అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆందోళనలకు దిగారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానం చెప్పినప్పటికీ వాళ్లు వినలేదు. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే.. ఆమోదం పొందిన బిల్లుల కాపీలను చింపి కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ మీద విసిరారు. దీనితో బీజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

Advocate Rajiv Mohan: నిర్భయ నిందితులను ఉరి తీయాలన్న లాయరే ఇప్పుడు బ్రిజ్ భూషణ్ కు బెయిల్ ఇప్పించారు

బీజేపీకి చెందిన డాక్టర్ సీఎన్ ఆశ్వత్ నారాయణ్, వి.సునీల్ కుమార్, ఆర్.ఆశోక్, అరగ జ్ఞానేంద్ర, వేదవ్యాస్ కామత్, యశ్ పాల్ సువర్ణ, అరవింద్ బెల్లాడ్, దేవరాజ్ మునిరాజ్, ఉమానాథ్ కొట్యాన్, భరత్ శెట్టి అనే పది మంది ఎమ్మెల్యే సస్పెండ్ అయిన జాబితాలో ఉన్నారు. వీరిని మార్షల్స్ సహాయంతో సభ బయటకు తరలించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోనే వీరు ఆందోళనకు దిగారు.

INDIA: కులతత్వ పార్టీలతో కాంగ్రెస్ కూటమి.. ఇండియా కూటమిపై బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన వ్యాఖ్యలు

అంతకు ముందు సభలో తీవ్ర ఆందోళన కొనసాగింది. ఈ గందరగోళం మధ్యే ప్రభుత్వం ఐదు బిల్లును ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. ఈ బిల్లులను ఆమోదించిన వెంటనే సభను మధ్యాహ్నానికి వాయిదా వేయకుండా బడ్జెట్ పై చర్చించాలని స్పీకర్ యూటీ ఖాదర్ నిర్ణయించారు. సభా కార్యక్రమాలను డిప్యూటీ స్పీకర్‭ను ఆదేశించారు. మరో వైపు విపక్ష కూటమి సమావేశానికి ఐఏఎస్ అధికారుల నియామకంపై అసెంబ్లీలో జనతాదళ్(సెక్యులర్) ఎమ్మెల్యేలు కూడ ఆందోళనకు దిగారు.