Gautam Gambhir : గంభీర్ గొప్ప మనస్సు.. తూర్పు ఢిల్లీలో ఫ్రీ కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులు
తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఉచితంగా కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులను ప్రారంభించారు. ప్రత్యేకించి పెద్దల కోసం ఉచితంగా ఈ కొవిడ్ టీకా క్యాంపులను ఏర్పాటు చేశారు.

Bjp Mp Gautam Gambhir Sets Up Free Covid Vaccination Camps In East Delhi
Gautam Gambhir free Covid vaccination camps : తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఉచితంగా కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులను ప్రారంభించారు. ప్రత్యేకించి పెద్దల కోసం ఉచితంగా ఈ కొవిడ్ టీకా క్యాంపులను ఏర్పాటు చేశారు. 10వేల మందికి ఈ క్యాంపుల ద్వారా వ్యాక్సిన్ అందించేలా ప్లాన్ చేశారు. కర్కార్‌డూమాలోని జాగృతి ఎన్‌క్లేవ్‌లో తన ఆఫీసు వద్ద ఫ్రీ కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
ప్రతిరోజు ఈ క్యాంపులో 300 మందికి వ్యాక్సిన్ అందించనున్నారు. 18ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో వారికి కూడా వ్యాక్సిన్ అందించేలా ఉచితంగా క్యాంపులను ప్రారంభించినట్టు గంభీర్ తెలిపారు.
जो कर्म में विश्वास रखते हैं वो नसीब का रोना नहीं रोया करते! #MissionVaccinateDelhi in full swing! pic.twitter.com/zUN6cbNIPR
— Gautam Gambhir (@GautamGambhir) June 10, 2021
కరోనా సెకండ్ వేవ్ సమయంలో తన ఫౌండేషన్ ద్వారా కొవిడ్ బాధితులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సెట్రేటర్స్, ఫ్యాబిఫ్లూ పంపిణీ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ (GGF) తన బృందంతో కలిసి సంయుక్తంగా కొవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు.