GVL Narasimha Rao : కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..
కాంగ్రెస్‌కి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఉండదు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలపడినా లోక్‌సభ ఎన్నికల్లో 28 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది.

GVL Narasimha Rao | Karnataka Election Results 2023
GVL Narasimha Rao – BJP : బీజేపీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బీజేపీ గట్టిపోటీ ఇచ్చిందని..కాంగ్రెస్‌కి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఇతర రాష్ట్రాలపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఉండదన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలపడినా లోక్‌సభ ఎన్నికల్లో 28 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. కర్నాటకలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం లేదని..బీజేపీ 36 నుంచి 37 ఓట్ల శాతం పెంచుకుందని తెలిపారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యే సమయానికి బీజేపీ ఓటింగ్ శాతంలో మరింత పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజారిటీ సాధించే అవకాశం లేదని..ప్రధాని పర్యటన వల్ల బీజేపీకి ఈ స్థాయి ఫలితాలు వస్తున్నాయన్నారు. పొలిటికల్ నిపుణులు చెప్పినదానికంటే బీజేపీ పరిస్థితి మెరుగయిందని ఇది శుభపరిణామం అని ఈ ఓటు బ్యాంకును లోక్ సభ స్థానాల్లో పెంచుకుంటామన్నారు.
కర్నాటకలో ఒక సారి అధికారంలో ఉన్న పార్టీ గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించే అవకాశం లేదని..అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉన్నా లోక్ సభలో మాత్రం బీజేపీ ప్రభంజనం చూపిస్తుందని అన్నారు. ప్రధాని మోదీ పర్యటనకు తోడుగా స్థానిక నాయకత్వం మరింత కష్టపడితే ఇంకా మెరుగయిన ఫలితాలు వచ్చేవని ఆశాభావం వ్యక్తంచేశారు. ఒక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల ప్రభావం పక్క రాష్ట్రాల పై ఉండే అవకాశం లేదని జీవీఎల్ తెలంగాణను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారు.
కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 34 జిల్లాల్లో 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మొదటి రౌండ్ ఫలితాల తరువాత కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతుంటే..ఆరుగురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ 15,098 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధ రామయ్య 1,224 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా చామరాజనగర్ నుంచి పోటీ చేస్తున్న సోమన్న కాంగ్రెస్ అభ్యర్థి పుట్టరంగశెట్టిపై 9వేల ఓట్ల మెజార్టీతో వెనుకంజలో ఉన్నారు.