Ravikishan : గ్రామంలో స్వయంగా శానిటైజ్​ చేసిన ప్రముఖ నటుడు,ఎంపీ రవికిషన్

కరోనా ఉద్ధృతి వేళ ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ గ్రామంలో శానిటైజేషన్​ పనుల్లో ప్రముఖ నటుడు, గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ స్వయంగా పాల్గొన్నారు.

Ravikishan : గ్రామంలో స్వయంగా శానిటైజ్​ చేసిన ప్రముఖ నటుడు,ఎంపీ రవికిషన్

Bjp Mp Ravikishan Participate In Up Village Sanitization Work

Updated On : May 25, 2021 / 10:01 PM IST

Ravikishan కరోనా ఉద్ధృతి వేళ ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ గ్రామంలో శానిటైజేషన్​ పనుల్లో ప్రముఖ నటుడు, గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ స్వయంగా పాల్గొన్నారు. గోరఖ్​పుర్ నియోజకవర్గం​లోని రజహీ గ్రామంలోని పారిశుద్ధ్య పనులను మంగళవారం రవికిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రవికిషన్ స్వయంగా.. క్రిమి సంహారక రసాయనాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మాస్కులు పంపిణీ చేశారు.

వైరస్ కేసులు పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని రవికిషన్ చెప్పారు. భద్రత, పరిశుభ్రత అన్నింటికన్నా ముఖ్యమన్నారు. అనంతరం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని రవికిషన్ ప్రారంభించారు. రేషన్ కార్డులు లేని వారికి వెంటనే జారీ చేయాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, ఆనందమే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యమని చెప్పారు.